ఏపీలో హాట్ హాట్ రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే సవా లక్ష ప్రజా సమస్యలు ఏపీ నిండా ఉన్నాయి. ఒక వైపు కొత్త జిల్లాలు ప్రకటించారు. వాటి రూపూ రేఖా ఏదీ లేదు. ఇంకా బాలారిష్టాలు ఎన్నో ఉన్నాయి. చాలా చేయాలి, చూడాలి. బోలెడు తతంగం ఉంది. మరో వైపు విద్యుత్ కష్టాలు ఏపీని పట్టి పీడిస్తున్నాయి. ఎడా పెడా విద్యుత్ కోతలతో జనాలు సతమతం అవుతున్నారు. ఇంకో వైపు చూస్తే విద్యుత్ చార్జీల భారం మంట పుట్టిస్తోంది.
ఇంకో వైపు మండు వేసవిలో పదవతరగతి, ఇంటర్ పరీక్షలు సహా అన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇక ఆర్ధిక సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇపుడు వీటికి తోడు రాజకీయ సమస్యలు కూడా విపక్షాల నుంచి ఎటూ వస్తూనే ఉన్నాయి. దానికి తగినట్లుగా ప్రభుత్వం కూడా కొత్త సమస్యలను సృష్టించుకుంటోంది అంటున్నారు.
మంత్రి వర్గ విస్తరణ అని కొందరిని తీసుకుని భర్తీ చేస్తే పోయేది కానీ ఏకంగా పునర్ వ్యవస్థీకరణ పేరిట అతి పెద్ద సాహసానికి జగన్ దిగిపోయారు అంటున్నారు. మొత్తం మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ఆయన తీసుకున్నారు. ఇపుడు కొత్తగా మంత్రివర్గం ఏర్పాటు కాబోతోంది. ఇందులో ఎవరు ఉంటారో తెలియదు. ఎలా చూసుకున్నా ఇరవై నాలుగు మందికి మాత్రమే అక్కడ చోటు ఉంది.
అంటే జగన్ తప్ప మొత్తం 150 మందిలో తొలి ఇరవై నాలుగు మందినీ తొలగించినా మరో ఇరవై నాలుగు మందికే చాన్స్ అన్న మాట. ఇపుడు చూస్తే అందులో కొందరిని కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. అంటే ఏతా వాతా నలభై మందికే చాన్స్ టోటల్ జగన్ అయిదేళ్ళ ఏలుబడిలో దక్కుతుంది. మరి మిగిలిన 110 సంగతి ఏంటి. వారిలో కొందరు ఆశలు వదులుకున్న కనీసంగా అరవై డెబ్బై మంది దాకా ఆశలు పెట్టుకునే ఉంటారు కదా.
అందువల్ల మంత్రి పదవుల విషయంలో అనవసరంగా తేనె తుట్టెను జగన్ కదల్చారు అని అంటున్నారు. దాని వల్ల పాత కొత్త నేతల అసంతృప్తులతో వైసీపీ పూర్తిగా ఇబ్బందులో పడుతోంది అంటున్నారు. రాజీనామా చేసిన మంత్రులు బయటకు సంతోషంగా ఉన్నారు కానీ లోపల మాంత్రం రగిలిపోతున్నారు. దానికి కారణం వారి పదవులు తొలగించడానికి బలమైన రీజన్ ఏదీ లేకపోవడం.
ఫలానా కారణం అని చెబితే అర్ధం చేసుకుంటారు. కానీ నాడు హామీ ఇచ్చాను కాబట్టి నేడు మాజీలు కండి అంటే ఎవరూ తట్టుకోలేరు. ఇక పదవులు అన్నవి వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు లెక్క. ఒకసారి కుర్చీ ఎక్కిన వారిని దిగమంటే కోపం వస్తుంది. పైగా ఎవరి మీద అవినీతి ఆరోపణలు లేవు. అలాగే అన్ని ఎన్నికల్లో జిల్లాల్లో వైసీపీని గెలిపించుకుని వచ్చారు. దానికి తోడు రెండేళ్ళుగా కరోనా సైతం పీడించి ఎవరినీ బయటకు పోనీయలేదు
ఇలా అన్ని వైపులా మంత్రులు సతమతమవుతూ కూడా వైసీపీ ని కాసుకుంటూ వస్తున్నారు. జగన్ మీద ఒక్క మాట అనకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ టైమ్ లో అది కూడా ఎన్నికలకు గట్టిగా రెండేళ్లు లేని వేళ ఇంతటి ఆపరేషన్ అవసరమా అన్న చర్చ అయితే వస్తోంది. ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా మరింతమంది రగులుతూనే ఉంటారు. ఇక మాజీలు అయిన వారి సంగతి వేరే కధ.
టోటల్ గా చూస్తే వైసీపీ ఇపుడు అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకుంటోందా అన్న డౌట్లు వస్తున్నాయి. మాజీలు అయిన మంత్రులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మంతనాలు జరిపి బుజ్జగిస్తున్నారు అంటే సీన్ ఎంతటి సీరియస్ గా ఉన్నది అర్ధమవుతోంది. ఇక మంత్రి పదవికి బదులుగా ఏ హోదా ఇచ్చినా ఏ ప్రభుత్వ పదవి ఇచ్చినా సాటి కావు కదా అన్నదే మాజీల బాధ. అలాగే అనేక లెక్కలు, సామాజిక సమీకరణల వల్ల ఆశావహులకు కూడా చాలా మందికి మొండి చేయి చూపించే ప్రమాదం ఉంది.
దాంతో వారూ వీరూ అని కాకుండా టోటల్ గా ఆ 24 మంది జగన్ తప్ప అంతా అసంతృప్తిలో మునిగితేలేలా ఈ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం అవుతుందా అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెల 11 తరువాత ఏం జరుగుతుంది, ఎంత మంది అసమ్మతి రాగాలు వినిపిస్తారు అన్నది లెక్క వేసుకోవాలి అనే అంటున్నారుట.