రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే... రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. లోటులో ఉన్నామని కేంద్రం వద్ద మొర పెట్టుకుంటున్నా కూడా అది బధిర శంఖారావమే అవుతోంది. మీకు అంతిచ్చాం... ఇంతిచ్చాం అంటూ కేంద్రం చెబుతోంది. అంతేకాదు.. ఆర్థిక ఇబ్బందులుంటే అంత ఖర్చెందుకు పెడతారని ప్రశ్నిస్తోంది. ఈ తరుణంలో ఏపీకి ఉన్న రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఏ స్థాయిలో ఉందో కాగ్ నివేదిక కూడా వెల్లడించింది. రెండేళ్ల కిందట ఉన్న ద్రవ్య లోటే ప్రస్తుత బడ్జెట్ లో నాలుగో వంతుకు సమానంగా ఉందని తేలింది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లక్షా 35 వేల కోట్లు... కానీ, అందులో నాలుగో వంతు ఇప్పటికే లోటు ఉందట. తాజాగా ఏపీ శాసనసభలోనూ అదే సంగతి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో బుధవారం కాగ్ నివేదిక ప్రవేశపెట్టారు. దాని ప్రకారం ద్రవ్య లోటు దాదాపు 32 వేల కోట్లు.
ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. 2014-15లో రెవెన్యూ లోటు రూ.24,194 కోట్లు, ద్రవ్య లోటు రూ.31,717 కోట్లని పేర్కొంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సూచించిన 3 శాతం పరిమితికి మించి రెట్టింపు స్థాయి లోటు ఉన్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. మొత్తం 6.10 శాతం లోటు నమోదైందని తెలిపింది. అదే విధంగా శాసనపరమైన సాధికారికత లేకుండా ప్రభుత్వం రూ.13.134.68 కోట్లు అదనపు వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొంది.
కాగా విభజనతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇలా ఉండగా పొరుగునే ఉన్న తెలంగాణ మాత్రం కాసుల గళగళలతో హుషారుగా ఉంది. అక్కడ రెవెన్యూ మిగులు ఉన్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 2014-15 సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ మిగులు రూ.369 కోట్లుగా కాగ్ పేర్కొంది. అదే విధంగా జడ్పీ ప్రావిడెంట్ ఫండ్‌కు ప్రభుత్వం రూ.651 కోట్లు చెల్లించాలని నివేదికలో సూచించింది.