మనోళ్ల మాటలు హద్దులు దాటేస్తున్నాయ్ అసద్?

Update: 2020-11-27 16:43 GMT
గతానికి పూర్తి భిన్నంగా సాగుతోంది గ్రేటర్ ఎన్నికల ప్రచారం. ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడేస్తున్నారు. తమ మాటలతో పార్టీ పరువు.. ప్రతిష్ఠ మాటేమిటి? ప్రజలకు సమాధానం చెప్పాలా? అక్కర్లేదా? అసలు.. ప్రజాప్రతినిధులు అన్నోళ్లు భాద్యత అన్నది ఉండదా? అన్న సందేహం రాక మానదు. ఇప్పటికే పలువురు మజ్లిస్ అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన చిట్టి వీడియోలు వైరల్ కాగా.. తాజాగా బహదూర్ పురా మజ్లిస్ ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తాజాగా నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీకి వచ్చి కరెంట్.. వాటర్ బిల్లులు కట్టాలని అడిగే ధైర్యం ఏ అధికారికి లేదని.. అది మజ్లిస్ గొప్పతనమన్నారు. బిల్లులు కట్టే అవసరం లేకుండా మజ్లిస్ కు ఓటు వేయాలని ఎన్నికల ప్రచార సభలో ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఈ ఇలాకా మాదిరా.. ఇక్కడ సర్కార్ మాదిరా.. బిల్లులు కట్టేది లేదురా.. అడిగితే కొట్టటం ఖాయంరా’’ అంటూ రిథమిక్ లో మాట్లాడే మాటలు వింటే మతి పోవాల్సిందే.
ఇంత ఓపెన్ గా ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడేస్తున్న మాటలు.. వైరల్ అయ్యాక కూడా ఎలాంటి చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం తీరుతో నోట మాట రాదంతే. మరీ తరహా వ్యాఖ్యలపై అధికారులు.. ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందా? అయినా.. ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడే నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోరా అసద్? అన్నది క్వశ్చన్. మరి.. మజ్లిస్ అధినేత సమాధానం ఇస్తారంటారా?

Full View
Tags:    

Similar News