పక్షుల్లాగే మనకూ రెక్కలుంటే ఎంతో బాగుండో.. ఎంచక్కా గాలిలో ఎగిరేవాళ్లం అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. హాలివుడ్ సినిమాల్లో కథానాయకులు, ప్రతినాయకులు వెనక ఓ సిలిండర్ తగిలించుకొని గాల్లో ఎగరడం చూస్తే మనకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండు అనుకుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. బ్యాక్ ప్యాక్ సాయంతో గాలిలో ఎగరిపోవచ్చు. అయితే దానికి కాస్త సమయం పడుతుంది.
గాలిలో ఎగరాలనుకునే వారికి ఆస్ట్రేలియాకు చెందిన కాప్టర్ ప్యాక్ అనే సంస్థ ఓ శుభవార్త చెప్పింది. బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్ పేరిట ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. అందుకు సంబంధించిన టెస్ట్ రన్ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోల్లో ఓ యువకుడు ఒక యంత్రాన్ని తగిలించుకొని గాలిలో ఎగురుతున్నాడు. 50 మీటర్ల అడుగుల ఎత్తులో కొన్ని సెకన్ల పాటు విహరించాడు. ఈ వీడియోలు చాలా మందిలో ఉత్సాహాన్ని నింపాయి.
హెలికాప్టర్ లాగే మోటార్, రూటర్ లు ఈ బ్యాక్ ప్యాక్ కు ఉంటాయి. రెండు టర్బైన్లను అమర్చుతారు. ఈ టర్బైన్లను వెనక తగిలించుకొని గాలిలో ఎగరవచ్చు. వీటికి ప్రత్యేకంగా బ్యాటరీలను ఏర్పాటు చేశారు. అవి ఛార్జింగ్ సాయంతో పని చేస్తాయి. అవసరం అనకున్నప్పుడు బ్యాటరీలను ఉపయోగించవచ్చు. గతంలో ఇలాంటి ప్రయోగాలు జరిగినా అవి విఫలం అయ్యాయి. చైనా, దుబాయ్, న్యూజిలాండ్ కు చెందిన పలు కంపెనీలు బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్ ను తయారు చేశాయి.
కొన్ని సాంకేతిక లోపాలతో అవి ప్రాణాల మీదకు తెచ్చాయి. దుబాయ్ కు చెందిన ఓ సంస్థ జెట్ బ్యాక్ ప్యాక్ పేరిట రూపొందించింది. 240 కిలోమీటర్ల వేగంతో 20 వేల అడుగుల ఎత్తు వరకు దూసుకుపోయేలా అభివృద్ధి చేసింది. కానీ ఇంధన సమస్యలు తలెత్తాయి. గాలిలో ఎగిరే సమయంలో ప్యారాచూట్ తెరుచుకోకపోవడం వల్ల ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఫలితంగా అది విఫలమైంది.
ఈ బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్ కు మరికొన్ని మార్పులు అవసరం అని నిర్వాహకులు అంటున్నారు. ఈ ట్రయల్ రన్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ప్రయోగం సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇది విజయవంతమైతే ఎంచక్కా గాలిలో ఎగిరిపోవచ్చని యువత హుషారుగా కనబర్చుతున్నారు.
Full View