ఒంటారియా ఆరోగ్యశాఖ సహాయ మంత్రి దీపికా దామెర్ల తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అయిదేళ్ల కిందట కెనడాలో భగవద్గీతపై ప్రమాణం చేసి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ఆమె అప్పట్లో అక్కడ సంచలనం సృష్టించారు. అయిదేళ్ల తరువాత తన సొంత ప్రాంతానికి అధికారిక హోదాలో వచ్చిన ఆమె గురువారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంతో కెనడా ప్రభుత్వం తరఫున పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి ప్రభుత్వ వర్గాలు, అధికారులతో తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. అంతే కాదు... తాను హైదరాబాద్ లో జన్మించి, కెనడాకు వెళ్లానని, తమ తాత, అమ్మమ్మ ఇక్కడే ఉన్నారని తెలిపారు. గురువారం ఉదయమే వారిని కలిసి ఆశీర్వాదాలు పొందారు. దేశంలోని అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని, వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి సాధించిందని ఆమె ముచ్చట పడ్డారు.
దీపికా దామెర్ల హైదరాబాద్ లో జన్మించి ఇక్కడే చదువుకున్నారు. తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం, బేగంపేటలోని రాజా జితేంద్ర స్కూల్ లో చదువుకున్నారు. 1991లో ఆమె కెనడా వెళ్లారు. అక్కడే ఎంబీఏ చదువుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. జర్నలిస్టుగానూ పనిచేశారు. ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టి ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. జర్నలిస్టుగా ఉన్నప్పుడు ఎందరో రాజకీయనాయకులను కలిసిన ఆమె ఆ రంగంవైపు ఆకర్షితురాలై రాజకీయాల్లోకి వెళ్లారు. ఇండియాలో వారసత్వ రాజకీయాలు ఎక్కువని.... రాజకీయ నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి రావడం కష్టమని.. కానీ, కెనడా అలా కాదని ఆమె అంటున్నారు. 2011లో ఒంటారియో ప్రొవిన్షియల్ పార్లమెంటు సభ్యరాలు(ఎంపీపీ)గా ఎన్నికైన ఆమె అక్కడ మంత్రిగా పనిచేస్తున్నారు. కెనడాలో ఎంపీపీ అంటే ఇండియాలో ఎమ్మెల్యే పదవి వంటిది. తాజాగా ఆమె కెనడా ప్రభుత్వం తరఫున హైదరాబాద్ లో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.