ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత - మాజీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి - బ్యాంక్ నుంచి డబ్బులు కాజేశారంటూ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు.
కాగా, ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం టౌన్ బ్యాంక్ లో గోల్ మాల్ కలకలం రేపుతోంది. ఈ గోల్ మాల్ కి ప్రధాన సూత్రధారి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయానికి ఇవ్వాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. మనోహర్ సిఫారసుతో పలువురికి అడ్డగోలుగా లోన్లు మంజూరు చేసిన బ్యాంక్ ఇప్పుడు, ఆ లోన్ల డబ్బు వసూలు చేయలేక నానా తంటాలు పడుతోంది. లోన్లు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో బయటపడ్డ ఈ గోల్ మాల్ వెనుక బడా నేతల ప్రమేయం ఉన్నట్టు కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గోల్ మాల్ లో దాదాపుగా 2కోట్ల 97 లక్షల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయ్యింది.