ఈ సమాజంలో ఆడవారికి రక్షణ అనేది అసలు లేకుండాపోయింది. తాజాగా జిల్లా పరపాలనా కేంద్రమైన కలెక్టరేట్ లోనే స్వయంగా కలెక్టరే ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లో కలకలం రేపింది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని జంగజీర్ చాంఫ్ కలెక్టరేట్ లో తనపై కలెక్టర్ జనక్ ప్రసాద్ పాథక్ తన కోరిక తీర్చకపోతే తన భర్తను ఉద్యోగం నుంచి తీసేస్తానని, బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 15వ తేదీన కలెక్టరేట్ లోనే తనపై అత్యాచారం చేశాడని తన ఫిర్యాదులో 33 ఏళ్ల మహిళ పేర్కొంది. గతంతో అతని నుంచి తనకు చాలా అశ్లీల వీడియోలు, ఫోటోలు కూడా వచ్చాయని చెబుతూ దానికి సంబంధించి స్క్రీన్ షాట్స్ ను కూడా పోలీసులకు చూపించింది.
ఆమె ఫిర్యాదు మేరకు కలెక్టర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనట్టు జంగజీర్ చాంపా జిల్లా ఎస్పీ వెల్లడించారు. కలెక్టర్‌పై ఐపీసీ 376, 506, 509 బి సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇక, కలెక్టర్‌ను ఛత్తీస్‌ఘడ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టరు గా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయక పోవడం గానీ, చర్యలు తీసుకోక పోవడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి.