కరోనా మహమ్మారిని నిర్ములించడానికి మన దగ్గరున్న ఏకైక మార్గం సామజిక దూరం. అందుకే కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. అయితే అక్కడక్కడా కొంతమంది లాక్ డౌన్ ను అంతగా పాటించడం లేదు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నతమైన న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది. కరోనా మహమ్మారి నియంత్రణ కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను పటిష్టంగా అమలయ్యేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలలో ఆర్మీని రగంలోకి దించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తరఫున న్యాయవాదులు ఓం ప్రకాష్ - దుష్యంత్ తివారి పిటిషన్ ఈ దాఖలు చేశారు. లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఆరోగ్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయని - అలాగే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి అని , దాని కారణంగా పెద్దఎత్తున జనాలు గుమిగూడడం - మతపరమైన సమావేశాలు జరుగుతుండటంతో ఆర్మీని రంగంలోకి దించాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో పొందుపరిచారు.
అలాగే ఈ పిటిషన్ లో ఈనెల 14న ముంబైలో వలస కూలీలు పెద్దఎత్తున గుమిగూడిన అంశాలన్ని కూడా దానిలో పొందుపరిచారు. అలాగే కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వివాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడంలో విఫలమయ్యాయి అని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో అనేక చోట్ల ప్రజలు గుమిగూడడంపై జాతీయ దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఏదేమైనా దేశంలో మరికొంత కాలం లాక్ డౌన్ పకడ్బందీగా కొనసాగితేనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలమని నిపుణులు అంచనా వేస్తున్నారు.