కొర‌త లేద‌న్న పెద్ద‌మ‌నిషిని రోడ్ల మీద తిప్పాలి

Update: 2018-04-18 04:56 GMT
ఓప‌క్క తీవ్ర‌మైన న‌గ‌దు కొర‌త‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు ఉన్నా ఖాళీ ఏటీఎంలు ద‌ర్శ‌న‌మిస్తున్న దుస్థితి. ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఎనీటైం మ‌నీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఏటీఎంలు.. ఇప్పుడు ఎనీ టైం మూసేసుకున్న ప‌రిస్థితి. దీంతో.. జేబులో డ‌బ్బులు అవ‌స‌ర‌మై ఏటీఎంల వ‌ద్ద‌కు వెళ్లిన వారికి.. ఖాళీ ఏటీఎంలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఏటీఎంలు చుట్టూ తిర‌గ‌టానికే టైం స‌రిపోతోంది. మ‌రోవైపు న‌గ‌దు విత్ డ్రా చేసుకోవ‌టానికి బ్యాంకుల వ‌ద్ద‌కు వెళితే.. ఊహించ‌ని స‌మాధానం బ్యాంక‌ర్ల నుంచి వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు. రూ.ల‌క్ష‌.. అంత‌కు మించిన విత్ డ్రాల విష‌యంలో బ్యాంకులు నో క్యాష్ మాట‌ను చెబుతున్నాయి. క్యాష్ అందుబాటులోకి వ‌చ్చినంత‌నే ఫోన్ చేస్తామ‌ని చెబుతున్నారు.

ఈ స‌మ‌స్య మూడు నెల‌ల నుంచి ఉన్నా.. ఈ మ‌ధ్య‌న మ‌రింత ఎక్కువ అవుతోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి ఆర్థిక‌మంత్రి జైట్లీకి ట్వీట్ చేశారు. ఒక రాష్ట్రానికి చెందిన కీల‌క మంత్రి ఒక‌రు క్యాష్ క్రంచ్ మీద రియాక్ట్ కావ‌టం.. ట్వీట్ తో స‌మ‌స్య‌ను త‌న దృష్టికి తీసుకొచ్చిన నేప‌థ్యంలో ఆయ‌న స‌మాధానం చెప్ప‌క త‌ప్పింది కాదు. క్యాష్ క్రంచ్ కొన్నిచోట్ల ఉన్న‌దే త‌ప్పించి అన్నిచోట్ల లేద‌న్నారు.

ఈ మ‌ధ్య‌నే ఏటీఎంలు ఖాళీగా క‌నిపిస్తున్న‌ట్లుగా జైట్లీతో పాటు.. కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి ఎస్సీ గార్గ్ చెప్పుకొచ్చారు. వీరి మాట‌లు వింటే ఏటీఎంల‌లో ఫుల్ క్యాష్ ఉన్నట్లుగా అనిపించ‌క మాన‌దు.  అందుకే.. వీరిద్ద‌రిని అయితే తెలుగు రాష్ట్రాల్లో కానీ.. లేదంటే హైద‌రాబాద్ లో కానీ తిప్పితే ప్ర‌జ‌లు ప‌డుతున్న అవ‌స్థ‌లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థ‌మ‌వుతాయ‌ని చెప్పాలి. ఇదే తీరు మ‌రికొంత కాలం కొన‌సాగితే బ్యాంకుల మీద ప్ర‌జ‌లు న‌మ్మ‌కం కోల్పోవ‌ట‌మే కాదు.. కొత్త త‌ర‌హా సంక్షోభంలోకి మోడీ స‌ర్కారు కూరుకుపోవ‌టం ఖాయం. ఇప్పుడున్న స‌మ‌స్య‌లు స‌రిపోవ‌న్న‌ట్లు కొత్త స‌మ‌స్య‌ల్ని మోడీ స‌ర్కార్ ఆహ్వానిస్తుందా?  లేదా?  అన్న‌ది రానున్న రోజులు చెప్పేయ‌టం ఖాయం.
Tags:    

Similar News