‘క్యాసినో పెట్టానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి పెట్రోల్ పోసుకొని చస్తా: కొడాలి నాని

Update: 2022-01-21 12:41 GMT
టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి కొడాలి నాని.. బూతులు తిడుతూ మండిపడ్డారు. తన కళ్యాణ మండపంలో 'క్యాసినో' నిర్వహిస్తున్నాన్న ఆరోపణలపై కొడాలి నాని స్పందించారు. 'చంద్రబాబు గాడూ.. వాళ్లు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏవో విజువల్స్ తీసుకొచ్చి.. అక్కడేదో జరిగిపోయిందని ఫోకస్ చేశారని.. తాను ఊళ్లో లేనప్పుడు ఆ కళ్యాణ మండపంలో చంద్రబాబుకు, ఆయనకు డబ్బా కొట్టే డబ్బా గాళ్లకు కానీ చాలెంజ్ విసిరారు' మంత్రి కొడాలి నాని..

రెండున్నర ఎకరాలలోని నా కళ్యాణ మండపంలో 'క్యాసినో' కానీ.. పేకాట కానీ.. పెట్టానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చస్తా అని ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన సవాల్ చేశారు. ఒక వేళ నిరూపించలేకపోతే ఈ గజ్జికుక్కలు.. చంద్రబాబు తొత్తులు ఏం చేస్తారో చెప్పాలని అడుగుతున్నానని ఏపీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు.

చంద్రబాబుకు టైం అయిపోయిందని.. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాడని.. నిజ నిర్ధారణ కమిటీ పెట్టి  ఎప్పుడూ గెలవని వర్ల రామయ్యలాంటి వేస్ట్ గాడిని.. పనికిమాలిన ప్రజల్లో గెలవని చెత్తనా కొడుకులను పోగేసి.. పనికిమాలిన పకోడి గాడిన పంపి గుడివాడలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు సిగ్గూ శరం లేదు. ఆయన కుక్కలు రికార్డింగ్ డ్యాన్స్ అని చూపిస్తారు.. గుడివాడలో పండక్కి కోడిపందేలు ఇతర వేడుకలు జరిగినట్టు ఇక్కడా జరిగాయని.. గుడివాడలో మహిళలతో డ్యాన్స్ చేస్తున్నారని వార్త తెలియగానే.. టీవీలో రాగానే తాను పోలీసులకు ఫోన్ చేసి మరీ గుడివాడలో డ్యాన్సులు ఆపించానని కొడాలి నాని తెలిపారు.

దాన్ని కూడా క్యాష్ చేసుకున్నారని.. 'క్యాసినో' అంటూ పేకాట అంటూ వీడియోలు తీసి వైరల్ చేశారని.. చంద్రబాబు వచ్చినా.. ఆయన నాన్న ఖర్జూర నాయుడు వచ్చినా గుడివాడలో నా వెంట్రుక కూడా పీకలేడని మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు.

చంద్రబాబు వద్ద పిడిగ్రీ తినే కుక్కలు కొన్ని ఉన్నాయని..  అవి మొరుగుతుంటాయని.. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని ఫైర్ అయ్యారు. మీడియా ఉందని. నా కళ్యాణ మండపంలో చూపిస్తానని.. ఎటువంటి క్యాసినో, పేకాట ఆడుతున్నట్టు తేలితే తాను రాజకీయాలు వదిలేసి ఆత్మహత్య చేసుకుంటానని కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు బ్రోకర్ అని తిట్ల వర్షం కురిపించారు. నాడు ఎన్టీఆర్ కు మోసం చేశాడని.. గుర్తు కోసం అమ్మాయిని వాడుకున్నాడని.. ఇక భార్యను సైతం రాజకీయాల కోసం రోడ్డెక్కించాడని కొడాలి నాని సీరియస్ అయ్యారు.

Full View
Tags:    

Similar News