తెలంగాణ సర్కారు ఏర్పడిన తొలినాళ్లలోజిల్లాల్లో పర్యటనకు వెళ్లే కొందరు మంత్రులపై తేనటీగలు తరచూ దాడి చేసేవి. ఈ సందర్భంగా పలువురు తేనెటీగలు తెలంగాణ అధికారపక్ష నేతల్ని టార్గెట్ చేసినట్లుగా జోకులు కూడా పేలేవి. తర్వాతి కాలంలో తేనెటీగల ఉదంతం ఎదురుకాలేదు. తాజాగా ఒక పిల్లి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఎస్కార్ట్ వాహనంలో దూరిన పిల్లి దెబ్బకు ఆయన ఎస్కార్ట్ బృందం పడిన హైరానా అంతాఇంతా కాదనే చెప్పాలి.
పిల్లి అల్లరితో మంత్రి ఎస్కార్ట్ ఆగమాగమైనట్లుగా చెప్పొచ్చు. హరితహారంపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో ఒక సమావేశం జరిగింది. ఈ సభకు మంత్రి ఈటెలతో పాటు.. పలువురు అధికారపక్ష నేతలు హాజరయ్యారు. ఇంతవరకూ కథ బాగానే నడిచినా ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ సమావేశానికి హాజరైన జెడ్పీ ఛైర్మన్ ఉమ వాహనంలోకి ఒక పిల్లి చేరింది. దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్న సమయంలో జనాలు అక్కడ చేరుకున్నారు. దీంతో గందరగోళానికి గురైన పిల్లి ఉమ వాహనంలో నుంచి పక్కన ఉన్న మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంలోకి దూరింది. దీంతో.. ఎమ్మెల్యే డ్రైవర్ దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేయగా.. అది కాస్తా మంత్రి ఈటెల ఎస్కార్ట్ వాహనంలోని బాయినెట్ లోకి దూరటం.. దాన్ని బయటకు తీసేందుకు ఎంతగా ప్రయత్నించినా అది బయటకు రాకపోవటంతో భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. చివరకు ఎస్కార్ట్ వాహనాన్ని కలెక్టరేట్ లోని చెట్ల దగ్గరకు తీసుకెళ్లి.. వాహనాన్ని వదిలేసి.. జనసందోహాన్ని అటువైపు వెళ్లకుండా చేయటంతో.. కాసేపటికి పిల్లిబయటకు వచ్చి వెళ్లిపోవటంతో అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మొత్తానికి బుజ్జి పిల్లి హడావుడితో అధికారులు ఆగమాగం అయ్యారు.