48 మంది చచ్చిపోయినా సీబీఐ దర్యాప్తు వద్దంట

Update: 2015-07-06 17:10 GMT
పార్టీల మీద ఉండే అభిమానాల్ని పక్కన పెట్టేసి.. సాపేక్షంగా చూసినప్పుడు కాంగ్రెస్‌.. బీజేపీలు రెండూ దొందూ దొందూ అనిపించే సందర్భాలు కొన్ని కనిపిస్తాయి. తాజాగా.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలు చూస్తే ఇది నిజం అనిపించక మానదు.

ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ ఉన్న కాలంలో దేశంలో ఎంత పెద్ద ఘటన జరిగినా ఆయన అస్సలు పట్టించుకునే వారు కాదు. అదేమంటే.. తన మౌన ముద్రను వదిలేవారు కాదు. మన్మోహన్‌ పరిస్థితి మొత్తం రిమోట్‌ కాబట్టి అర్థం చేసుకోవచ్చు. తమ లాంటి వారి చేతికి అధికారం రావాలే కానీ.. తాట తీస్తామని చెప్పే బీజేపీ నేతలు ఇప్పుడు అధికారంలో వచ్చినప్పటికీ.. కొన్ని ఉదంతాల విషయంలో వారు ఎంత దారుణంగా వ్యవహరిస్తారన్నది వ్యాపం కుంభకోణం కేసును చూస్తే తెలుస్తుంది.

మధ్య ప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. ఈ స్కాంలో భాగంగా అనుమానాస్పదంగా 48 మంది మరణించి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నా.. ఈ ఘటనపై సీబీఐ విచారణ అస్సలు అక్కర్లేదని చెప్పేస్తున్నారు రాజ్‌నాథ్‌ సింగ్‌.

గడిచిన మూడు రోజుల వ్యవధిలో.. ఈ కుంభకోణం మీద దృష్టి సారించిన ముగ్గురు అనుమానాస్పద రీతిలో మరణించి.. దేశవ్యాప్తంగా గగ్గోలు పుడుతున్నా రాజ్‌నాథ్‌ పెద్దగా స్పందిస్తున్నది లేదు. వ్యాపం కుంభకోణం విషయంలో సీబీఐ విచారణ అక్కర్లేదని చెప్పటం ద్వారా.. మౌన ప్రధాని నేతృత్వంలోని సర్కారుకి.. మాటలు చెప్పేప్రధాని చెప్పే సర్కారుకు మధ్య వ్యత్యాసం ఏమీ లేదన్నది స్పష్టమవుతుంది.

Tags:    

Similar News