టీడీపీ ఎమ్మెల్సీ ఆస్తుల‌పై సీబీఐ రైడ్‌..

Update: 2017-05-12 14:46 GMT
తెలుగుదేశం పార్టీ ఉలిక్కిప‌డే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల్లో గెలుపొందిన నెల్లూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త వాకాటి నారాయ‌ణరెడ్డి ఇంట్లో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఏక‌కాలంలో నెల్లూరు-బెంగ‌ళూరు- హైద‌రాబాద్‌ లోని ఆఫీసుల్లో సీబీఐ అధికారులు సోదాల‌ను నిర్వ‌హించారు. ఇవాళ ఉద‌యం నుంచి వాకాటి ఇంట్లో సీబీఐ అధికారుల త‌నిఖీలు చేప‌ట్టింది. 2014లో బ్యాంకుల నుంచి రూ.190 కోట్లు రుణం తీసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఈనేప‌ధ్యంలో ఐఎఫ్సీఐ ఫిర్యాదుతో వాకాటిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. త‌దుప‌రి చ‌ర్య‌గా దాడులు జ‌రిపారు.

కాగా ,పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో భారీ నిధుల‌తో ఐటీకి చిక్కిన టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డితో ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి సంబంధం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ లింక్ ఆధారంగానే దాడులు జ‌రిగిన‌ట్లు ప‌లువురు పేర్కొంటున్నారు. మ‌రోవైపు  ఈ దాడులు తెలుగుదేశం పార్టీలో తీవ్ర క‌ల‌క‌లానికి దారితీశాయి. ఇప్ప‌టికే నెల్లూరుకు చెందిన మంత్రి నారాయ‌ణ కుమారుడిని కోల్పోయి జిల్లా శ్రేణులు ఆవేద‌నలో ఉన్న స‌మయంలో ఈ సంఘ‌ట‌న పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. కాగా, మనీలాండరింగ్‌ కేసులో శేఖర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. శేఖర్‌ రెడ్డి, అతని అనుచరులకు మద్రాస్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News