తీస్తా సెతల్వాద్...సామాజిక కార్యకర్తగా చేసిన మంచి పనుల కంటే సీబీఐ ద్వారానే ఈ మధ్య కాలంలో సెతల్వాద్ ఎక్కువగా ప్రచారం పొందుతున్నారు. ఆమె నివాసం, కార్యాలయాలు అనే తేడా లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తనిఖీలు నిర్వహిస్తోంది. ముంబైలోని ఆమె నివాసం, ఆమె భర్త జావెద్ ఆనంద్‌తోపాటు గులాం మహ్మద్ పెషిమమ్, సబ్‌రంగ్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్సీపీపీఎల్) కార్యాలయాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా విదేశీ విరాళాలు సేకరించారని సీబీఐ గత ఏడాది జూన్ ఎనిమిదో తేదీన కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాలను ప్రయోగించింది.
దీనిపై సెతల్వాద్ స్పందిస్తూ... సీబీఐ పంజరంలో చిలుకలా మారిందని,రాజకీయ కక్ష సాధింపు కోసం తమను బెదిరించడానికి, అవమానించడానికే ఆ సంస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఇంతకీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. అదే సమయంలో ప్రధానమంత్రి కాకముందు మోడీ సారథ్యం వహించిన గుజరాత్ సర్కారు కూడా అంతే స్థాయిలో ఎందుకు పగబట్టింది? ఈ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి.
జర్నలిస్టుగా ఉన్న తీస్వాసెతల్వాద్ 1992-1993 కాలంలో జరిగిన హిందూ-ముస్లిం అల్లర్లకు చలించిపోయారు. అలాంటి ఘటనలు ఎదుర్కునేందుకు సామాజిక కార్యకర్తగా ఉద్యమం మొదలుపెట్టారు. భర్త ఆనంద్‌తో కలిసి 1995లో సబ్రాంగ్ ట్రస్ట్ ఏర్పాటుచేశారు. 2002లో సిటిజెన్స్ ఫర్ జస్టిస్ ఆండ్ పీస్ పేరుతో అల్లర్ల బాధితుల తరఫున పోరాడేందుకు సంస్థ ప్రారంభించినపుడు వారికి కష్టాలు మొదలయ్యాయి. ఈ సంస్థ వల్లే 2002 గుజరాత్ అల్లర్ల కేసులో 120 మంది దోషులు శిక్ష పడింది. బాధితుల తరఫున న్యాయనిపుణులను సమకూర్చడం, సాక్షులను సమీకరించడం వంటి చర్యల్లో క్రియాశీలంగా తీస్తా సంస్థ భాగస్వామ్యం అయింది.
గుజరాత్ అల్లర్ల సమయంలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్యతో కలిసి అప్పట్లో సీఎంగా ఉన్న నరేంద్రమోడీకి వ్యతిరేకంగా స్థానిక హైకోర్టు నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వరకు పోరాటం సాగించారు. అయితే గతంలో అనుకూల తీర్పు వచ్చినప్పటికీ...రివ్యూ పిటిషన్ వేశారు. ఈనెల 27న విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో గుజరాత్ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు పాత కేసును తిరగదోడారు. ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ విరాళాలను స్వీకరించడంలో సెతల్వాద్ ముందస్తుగా కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అన్న అంశంతో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ గుజరాత్ పోలీసులు కేంద్రానికి లేఖ రాశారు. దీతో సీబీఐ రంగంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి.