బ్రేకింగ్: సీబీఎస్ఈ పరీక్షలు రద్దు

Update: 2021-06-01 15:30 GMT
కరోనా సెకండ్ వేవ్ తో మరో సంవత్సరం కూడా విద్యాసంవత్సరాన్ని వృథాగా విద్యార్థులు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది.పోయిన సంవత్సరం పరీక్షలు లేకుండానే పాస్ అయిపోయిన విద్యార్థులు ఈసారి కూడా అదే పరిస్థితి తెచ్చుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడుతూ వచ్చిన సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరిగింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్ విద్యార్థులకు మార్కులు వేయనున్నారు. విద్యార్థులను ఈ కరోనా సమయంలో పరీక్షలు రాయించడం సాధ్యం కాదని తేల్చారు. విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనలను పరిగణలోకి తీసుకొని పరీక్షలు రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది.

కోవిడ్ కారణంగా రాష్ట్రాలు , అందరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రధానికి అధికారులు వివరించారు. దీంతో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అబ్జెక్టివ్ ప్రమాణాల ప్రకారం 12 వ తరగతి విద్యార్థుల ఫలితాలను సంకలనం చేస్తామని సీబీఎస్ఈ తెలిపింది. 
Tags:    

Similar News