కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో పలు పరీక్షలు విద్యాసంస్థలు వాయిదా వేశాయి. సీబీఎస్ ఈ కూడా విద్యార్థుల పరీక్షల పై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే సీబీఎస్ ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేయడం సరికాదంటూ టోనీ జోసెఫ్ అనే ఉపాధ్యాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయడం వల్ల కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లు అవుతుందని టోనీ తరఫు న్యాయవాది జోస్ అబ్రహం ఈ పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయవాది మమతా శర్మ దాఖలు చేసిన పిటిషన్ లో ఇంప్లీడ్ అవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. 12వ తరగతి పరీక్షలు అనేవి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకం. ఉన్నత విద్యలో చేరడానికి ఈ పరీక్షా ఫలితాలు ఎంతో ముఖ్యం. ఈ పరీక్షలను రద్దు చేస్తే కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేసినట్లే. ఇంటర్నల్ అసెస్ మెంట్, విద్యా సంస్థలు నిర్వహించే ఆన్ లైన్ పరీక్షలు ఆధారంగా ఉత్తీర్ణత చేయడం అన్యాయం. ఇంటర్నల్ పరీక్షలు అన్నీ కూడా ఇంట్లో కూర్చొనే విద్యార్థులు రాశారు అని పిటిషన్ లో పేర్కొన్నారు. కోవిడ్–19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు వాయిదా వేశారని, జూన్ 1న పరిస్థితిని సమీక్షిస్తామని సీబీఎస్‌ఈ పేర్కొందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.