ఇంట్లో సీసీ కెమెరాలు.. వర్క్ ఫ్రం హోంకు కంపెనీలు

Update: 2021-08-14 11:47 GMT
కరోనా నేపథ్యంలో ఒకరినొకరు టచ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో 6 మీటర్ల దూరం ఉండాలని ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు తప్ప మిగతా రంగాలన్నీ మూసివేయాలని తెలిపింది. అయితే కేసులు కాస్త తగ్గుతున్న పరిణామంలో డిస్టేన్స్ ను మెయింటెన్ చేస్తూ  వ్యాపార కార్యకలాపాలు సాగించుకుంటున్నాయి కొన్ని వ్యాపార సంస్థలు. కానీ  కొన్ని కంపెనీలు మాత్రం తమ భద్రత దృష్ట్యా వర్క్ ఫ్రం హోం ను ఇదివరకే ప్రకటించింది. ఇప్పటికీ ఆయా కంపెనీలో ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్న వర్క్ ఫ్రం హోం చేస్తున్నా ఆయా ఉద్యోగుల కదలికలు ఎప్పటికప్పుడు యాజమాన్యం కనుసన్నల్లోనే ఉంటారు. ఎలాగంటే..?

కంపెనీ యాజమాన్యాలు గత మార్చిలో ఓ కాంట్రాక్ట్ ను జారీ చేశారు. దీని ప్రకారం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నా వారి కదలికలను తమ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అదేలాగంటే..ఉద్యోగులు పనిచేసేంది ఇళ్లల్లో. అయినా వారు పనిచేసే ప్రదేశంలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలట. అర్టిఫిషియల్ పవర్ట్ కెమెరాలను ఇన్ స్టాల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఉద్యోగులు చేసే పనిని మానిటరింగ్ చేస్తూ వాటిని స్టోరేజ్ చేస్తామని చెబుతున్నారు.

వర్క్ ఫ్రం హోం చేసే ప్రతీ ఉద్యోగి ఈ కాంట్రాక్టు ఒప్పుకోవాలని కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. కొందరు తమ ఉద్యోగం పోతుందనే భయంతో ఏమీ చేయలేక సంతకాలు పెడుతున్నారు. అదే సమయంలో చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. తమ ప్రైవేట్ ప్రదేశాన్ని వీడియో రికార్డు చేస్తున్నారని అంటున్నారు. ఇంటిదగ్గర ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే యాజమాన్యం ఇలాంటివి ప్రవేశపెడుతుందని ఆవేన వ్యక్తం చేస్తున్నారు. మేం ఇంటి దగ్గర పనిచేసిన కాల్ సెంటర్లలోనే పనిచేసినట్లుగా ఉందని కొందరు ఆవేదన చెందుతున్నారు. ఇక రాను రాను బెడ్రూంలో సీసీ కెమెరాలు ఫిక్స్ చేస్తారా..? అని అంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 80 వేలకు పైగా ఈ కాంట్రాక్టును ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. దీంతో తాము పని చేయడం కంటే ఇలాంటి వాటితోనే మానసికంగా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. అయితే 2.4 లక్షల మంది ఐటీ ఉద్యోగుల ఇళ్లల్లో ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇలా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.

ఒకవేళ ఉద్యోగుల విధుల్లో ఏదైనా తేడా వస్తే వారికి ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఉండవని అంటున్నారట. దీంతో కొంత మంది ఎంప్లాయిస్ ఒప్పుకోక తప్పలేదంటున్నారు. కానీ మహిళా ఉద్యోగుల మాత్రం తమ ప్రైవసీని కోల్పోతున్నామంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతామని ఈ విషయాలు యాజమాన్యాలకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసుల్లో పెట్టడం వల్ల ఇబ్బంది లేదని, అయితే ఇళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడమేనంటున్నారు.

కానీ యాజమాన్యాలు మాత్రం తమ వర్క్ క్వాలిటీ కోసం ఇవి తప్పనిసరి అంటున్నారు. కొందరు ఉద్యోగుల తీరుతో తాము చాలా నష్టపోయామని అందువల్ల కంపెనీ యాజమాన్యాలంతా కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటున్నాయి. ఉద్యోగులు తాము పనిచేసే చోట సీసీ కెమెరాలను అమరుస్తున్నామని వారి ఇళ్లు మొత్తం పెట్టడం లేదని అంటున్నాయి. అయితే వారి సొంత విషయాలు మాకవసరం లేదని, వర్క్ పర్యవేక్షణ మాత్రమే చేస్తామంటున్నాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కోసం ఉద్యోగుల ప్రావీణ్యం చూడాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. కొందరికి నష్టం కలుగుతుందని, ఈ ఒప్పందాన్ని మార్చలేమని కంపెనీలు తెలుపుతున్నాయి.
Tags:    

Similar News