పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైరే సుమా. అందులో డైలాగ్సే కాదు, సాంగ్స్ కూడా ఎక్కడ చూసినా తెగ ఊపేస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒక విధంగా చెప్పాలంటే పులకించిపోతున్నారు. ఏ ఫంక్షన్ అయినా పుష్ప సాంగ్స్ తోనే సందడి స్టార్ట్. ఏ నిరసన అయినా ఆ సినిమా పాటలతోనే అంతా సాగుతోంది. వారూ వీరూ తేడా లేదు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, సెలిబ్రిటీలు సైతం పుష్ప సాంగ్స్ కి డ్యాన్సులు ఒక లెక్కన చేస్తున్నారు.
ఆయన అసలే పద్యాలు పాడతారు, పాటలు కడతారు, ఆశువుగా కవితలు అల్లుతారు. ఆయనే వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఇక ఆయన ఈ బీట్ తో వచ్చే పాటను చూసి స్టెప్ వేయక ఉహూ అంటారా. ఊ అంటావా అంటే ఊ అనకుండా ఊరుకుంటారా సై అని చెప్పి మరీ వీర లెవెల్ లో డ్యాన్స్ అదరగొట్టేశారు. విశాఖ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఊ అంటావా మావా ఉహూ అంటావా అంటూ వేసిన స్టెప్స్ కి మొత్తం పార్టీ నాయకులు అంతా హుషారెత్తిపోయారు.
ఆ మీదట వారు కూడా ఆయనతో పాదాలు కదిపారు. అంతా కలసి ఒకటే సందడి చేస్తూ అక్కడ సంబరాలే చేశారు. ఒక చేత్తో కర్చీఫ్ పట్టుకుని ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ఈ డ్యాన్స్ ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే డ్యాన్సులు నెవర్ బెఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగానే సాగాయి. మొత్తానికి చూస్తే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మంచి కళాకారుడు అని ప్రతీ సందర్భంలో అలా రుజువు చేసుకుంటున్నారు.
ఇక ఆయన మంచి మాటకారి కూడా. పైగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. మరి ఈ జోష్ అంతా కూడా కాబోయే మంత్రిని తానే అన్న ఫీలింగ్ తోనే వస్తోంది అంటున్నారు. ఆ ముచ్చట కూడా తీరితే కనుక ఊ అంటావా మావా సాంగ్ ఏపీలోనే మోత మోగిపోదా అని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.
Full View