నవంబరు వరకు పెట్రో ధరలు పెరుగుతూ పోయి ప్రజలను బెంబేలెత్తించాయి. ధర అమాంతం పైపైకి వెళ్తుంటే.. జనం జేబులకు అంతగా చిల్లులు పడేవి. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం సైతం వ్యక్తమైంది. దీని ప్రతిఫలమా? అన్నట్టు ఉత్తర భారతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అసలే సాగు చట్టాల సెగతో అతలాకుతలం అవుతున్న బీజేపీ.. ముందుముందు కీలకమైన పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండడం తో ఉలిక్కిపడింది.
దీంతో గత నెల 3వ తేదీన పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అదేమిటో గాని.. ఆ వెంటనే బీజేపీ పాలిత, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర రాష్ట్రాలూ తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. పెట్రో ధరలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోయింది కేంద్రమే కాబట్టి... మరింత ఉపశమనం కూడా కేంద్రమే ఇవ్వాలని తెలంగాణ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు వాదించాయి. రాష్ట్రాల ఆదాయ వనరులు పరిమితం... అసలే కొవిడ్ సంక్షోభ సమయం కాబట్టి తాము తగ్గించలేమని అశక్తతను వ్యక్తం చేశాయి.
రెండేళ్లలో ఆదాయం రెట్టింపు
2019–20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.1.78 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2020–21కి ఇది రెట్టింపు కంటే ఎక్కువైంది. మొత్తం రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. దీనికి కారణం.. కేంద్రం పన్నులు భారీగా పెంచడమే. అంటే.. రెండేళ్లలో పన్నులను ఏ స్థాయిలో వడ్డించిందో తెలుసుకోవచ్చు. ఇందులో రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఉంటుంది.
ఇక 15వ-ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రు దక్కాల్సిన వాటా 41 శాతం. అంటే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చిన పన్నుల్లో రాష్ట్రాలకు వచ్చిన రూ. 3.72 లక్షల కోట్ల లో కేంద్రం రూ. 1,52,520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు చెల్లించాలి. ఈ 41 శాతం పన్నుల వాటాలో ఏ రాష్ట్రానికి ఎంతివ్వాలనేది ఫైనాన్స్ కమిషన్ (జనాభా దామాషా పద్ధతిన) నిర్ణయిస్తుంది.
ఆ ప్రకారం రాష్ట్రాలకు ఎక్సైజ్ డ్యూటీలో తమ వాటా అందుతుంది. కానీ 2020–21 ఆర్థికానికి 1.52.520 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు పంచాల్సిన కేంద్ర ఇచ్చిందెంతో తెలుసా? రూ. 19,972 కోట్లు మాత్రమే. అంటే 2020–21లో రాష్ట్రాలకు దక్కాల్సిన వాటాలో ఏకంగా 1,32,548 కోట్లను కేంద్రం తమ బొక్కసంలో వేసేసుకుంది. ఎందుకిలా? సమాఖ్య వ్యవస్థలో కేంద్ర సర్కారు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన న్యాయమైన వాటాను ఎలా తగ్గించగలదు? అనే కదా మీ సందేహం?
సెస్ కింద చూపి.. వాటా ఎగవేత
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై వసూలు చేసే పన్నును ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నేరుగా వసూలు చేస్తే... రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా దక్కుతుంది. ఇక్కడే కేంద్రం మతలబు చేస్తోంది. ఎక్సైజ్ డ్యూటీ పద్దు కింద నామమాత్రంగా చూపి... మిగతా పన్నును అంతా వివిధ సెస్సుల రూపంలో చూపెడుతోంది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే డివైజిబుల్ పూల్ (రాష్ట్రాలతో పంచుకునేది) కిందకు వస్తుంది. ఈ పద్దు కింద చూపే దాంట్లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. సెస్సుల రూపంలో వచ్చే దాంట్లో పైసా కూడా రాష్ట్రాలకు దక్కదు. గంపగుత్తగా వచ్చినదంతా కేంద్ర ఖజానాను వెళుతుంది.