ఏపీ ప్రభుత్వం - కేంద్ర మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఎక్కడ ఎక్కడ దొరుకుతుందా ? అని కేంద్రం కూడా ఎదురు చూస్తోంది. ఓ వైపు కేంద్రం నుంచి రావలసిన నిధులపై పదేపదే అడుగుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. అయితే ఏపీలో ఏదైనా చిన్న తప్పు జరిగితే మాత్రం ఎత్తి చూపే విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై గతంలో పంపిన లేఖకు ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వలేదని కేంద్రం తన అసహనం వ్యక్తం చేసింది. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తన ఎంపీలాడ్స్ నిధులను ఆయన పార్లమెంటు పరిధిలోని అభివృద్ధి పనుల కోసం వాడకుండా... చర్చిల నిర్మాణం కోసం కేటాయించాలని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై మీడియాలో కూడా ప్రముఖంగా కథనాలు వచ్చాయి.
వైసిపి రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజు ఏపీ ప్రభుత్వంలో లోపాలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్‌లో క్రిస్టియానిటీ విపరీతంగా పెరిగిపోతుందని ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ సురేష్ తన ఎంపీ నిధులను చర్చిల నిర్మాణం కోసం కేటాయించారన్న మీడియా కథనాలు ఊటంకిస్తూ ఏకంగా ప్రధానమంత్రి మోడీ కి లేఖ రాశారు.
ఈ లేఖపై స్పందించిన కేంద్రం వెంటనే నివేదిక పంపాలని కొద్ది నెలల క్రితమే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా లేఖలు రాసింది. ఈ లేఖలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎస్‌కు గణాకాంల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమ్య మరోసారి లేఖ పంపడంతో పాటు త్వరగా సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ప్రధాని కార్యాలయానికి ఇవ్వాలని కోరారు. మరి ఈ సారి ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో ? చూడాలి.