కరోనా వైరస్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత రెమ్ డెసివిర్ ఔషధం ప్రాముఖ్యత భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి స్వల్ప లక్షణాలు ఉన్న సమయంలో ఈ రెమ్ డెసివిర్ ఔషధం వాడితే కరోనా మహమ్మారి నుండి బయటపడొచ్చు. అందుకే చాలామంది ఈ వ్యాక్సిన్ కోసం ఎన్నో తిప్పలు పడ్డారు. అయితే , ఈ రెమ్ డెసివిర్ ఔషధం కొరత ఉండటం , దీని పంపిణి భాద్యత ఇప్పటివరకు కేంద్రం చూసుకుంటూ వచ్చింది. కానీ, రెమ్ డెసివిర్ ఔషధం పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తాజాగా తప్పుకుంది. ప్రస్తుతం రెమ్ డెసివిర్ రోజువారీ ఉత్పత్తులు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఈ మేరకు కేంద్ర కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మంత్రి మన్ సుఖ్ మందావియా ప్రకటన చేశారు. ఇకపై రెమ్ డెసివర్ పంపిణీ బాధ్యతలను పర్యవేక్షించాల్సిందిగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ ఏజెన్సీ, సీడీఎస్ సీవోలను ఆయన ఆదేశించారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు చికిత్సలో రెమ్ డెసివిర్ ఔషధం కీలకంగా మారింది. ఏప్రిల్ 15 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ రోజు 33,000 రెమ్‌డెసివిర్ వాయిల్స్ తయారయ్యేవి. మరోవైపు డిమాండ్ ఎక్కువగా ఉండేది. దీంతో మే 8 నుంచి రెమ్ డెసివర్ తయారీ కంపెనీల నుంచి కేంద్రం నేరుగా ఔషధాలను కొనుగోలు చేసేది. కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రాలకు ఈ ఔషధాన్ని పంపిణీ చేస్తూ వచ్చింది. రెమ్ డెసివిర్ కొరత అధిగమించేందుకు ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్యను 20 నుంచి 60కి పెంచారు. దీంతో రెమ్ డెసివిర్ ఔషధాల ఉత్పత్తి రోజుకు 33 వేల నుంచి 3.50 లక్షల వాయిల్స్ కి పెరిగింది. దీంతో రెమ్ డెసివిర్ పంపిణీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుంది. ఇప్పటి వరకు కేంద్రం 53 లక్షల వాయిల్స్ ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది. ఇటీవల కరోనా చికిత్స నుంచి రెమ్ డెసివిర్ మందును ఐసీఎంఆర్ తొలిగించింది.