జగన్ దీక్షకు కేంద్రం స్పందించింది

Update: 2017-05-03 13:36 GMT
గత నెల రోజులుగా... మిర్చి రైతులు రెండు తెలుగు రాష్ట్రాల్లో గిట్టుబాటు ధర లభించక అల్లాడిపోతున్నామని నెత్తి నోరూ మొత్తుకుంటున్నా... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. ఈ క్రమంలో దళారులు చెలరేగిపోయారు కూడా. ఓ దశలో క్వింటా ఏడు వేలు వున్నది... రూ.రెండు వేల రూపాయలకు తీసుకొచ్చేశారు దళారులు. దాంతో రైతులు కడుపు మంట మండింది. తెలంగాణలో అయితే ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డును రైతులు విధ్వంసం చేశారు కూడా. ఏపీలోనైతే ఇలాంటి చర్యలకు పాల్పడలేదు కానీ... రైతులైతే మాత్రం మిర్చీకి గిట్టుబాటు ధరలేదని ప్రభుత్వాలపై నిప్పులు చెరుగుతూనే వున్నారు.

రైతుల బాధను స్వయంగా తెలుసుకోవడానికి ఏపీ ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి.. ఏకంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును సందర్శించి... రైతుల బాధను.. దళారుల అరచకాలను తెలుసుకున్నాడు. దాంతో వెంటనే.. గుంటూరులో దీనిపై ‘రైతుదీక్ష’ను చేశాడు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాయో ఎంటగట్టారు. ఈ దీక్షకు రైతుల నుంచి కూడా భారీగానే స్పందన వచ్చింది. దాంతో కేంద్ర దిగొచ్చింది. ఈ రోజు మిర్చి రైతులకు క్వింటాకు రూ.5 వేల రూపాయలను ప్రభుత్వమే ఇచ్చి మిర్చి కొంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. అంతేకాదు.. రైతుల ఖర్చుకు రూ.1200 కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. క్వింటాకు రూ.5వేలు ఇచ్చే ధరలో రాష్ట్రం.. కేంద్రం ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియోలో డబ్బులు కేటాయిస్తాయని ప్రకటించారు. ఈ ప్రకటనతో అటు రైతులే కాదు.. వైసీపీ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తమ నాయకుడు మిర్చి రైతులకోసం చేసిన ‘రైతుదీక్ష’ ఫలించినట్టేనని ఆనందంతో ఉబ్బితబ్బవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News