బాబు నోటికి తాళం వేసేలా కేంద్రం రెస్పాన్స్‌

Update: 2017-12-01 10:02 GMT
పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు.. ఏపీలోని చంద్ర‌బాబు స‌ర్కారుకు మ‌ధ్య న‌డుస్తున్న మాట‌లు నెమ్మ‌దిగా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. స్పిల్ వే ప‌నులు ఆపాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు రావ‌టం.. దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి తీవ్రంగా స్పందించ‌టం.. అవ‌స‌ర‌మైతే ప్రాజెక్టు ప‌నుల్ని కేంద్రానికి అప్ప‌గించ‌టానికి తాను వెనుకాడ‌నంటూ చెప్పేశారు. బాబు మాట‌లు ఇలా సాగితే.. పోల‌వ‌రంపై తాము ఇచ్చిన ఆదేశాల్ని కేంద్రం స‌మ‌ర్థించుకుంది. బాబు వాద‌న‌కు చెక్‌ చెప్పాలని  తాజాగా తమ నిర్ణ‌యం వెనుకున్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

గ‌డిచిన స‌మావేశాల్లో తాము అడిగిన స‌మాచారాన్ని ఇవ్వ‌కుండానే రాష్ట్ర స‌ర్కారు టెండ‌ర్లు పిలిచింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది. మొత్తం అంశాన్ని పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ స‌మావేశంలో స‌మ‌గ్రంగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే  స్పిల్ వే.. స్పిల్ చాన‌ల్ టెండ‌ర్లను నిలిపివేయాల‌ని కోరిన‌ట్లుగా కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖాధికారులు వెల్ల‌డించారు.

టెండ‌ర్ నోటీసుపై ప‌లు అంశాలు లేవ‌నెత్తుతూ ప్ర‌స్తుత కాంట్రాక్ట‌ర్ ట్రాన్స్ స‌ర్టాయ్ కు న‌వంబ‌రు 18న కూడా లేఖ రాశామ‌న్నారు. కొత్త కాంట్రాక్ట‌ర్ పూర్తిగా రెఢీ కావ‌టానికి టైం ప‌డుతుంద‌ని.. అందుకే ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు అవ‌స‌ర‌మైన ప‌నుల షెడ్యూల్‌ను.. ఖ‌ర్చు వివ‌రాల్ని తెల‌పాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లుగా వెల్ల‌డించారు. అయితే తాము కోరిన స‌మాచారాన్ని రాష్ట్ర స‌ర్కారు పంప‌లేద‌న్నారు.

ఇప్పుడున్న ద‌శ‌లో ప్ర‌స్తుత కాంట్రాక్టు ప‌నులు ర‌ద్దు చేయ‌టం స‌రికాద‌ని.. దీని వ‌ల్ల అన‌వ‌స‌ర‌మైన వివాదాలు రేగ‌ట‌మే కాదు.. వ్య‌యం పెరుగుతుంద‌ని భావించామ‌ని అందుకే తాము అలా స్పందించాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. భారీ మొత్తంలో టెండ‌ర్లు పిల‌వాల్సి వ‌చ్చిన‌ప్ప‌డు క‌నీసం 45 రోజుల స‌మ‌యం ఇస్తే ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌తి స్పంద‌న వ‌స్తుంద‌ని.. కేవ‌లం రెండు వారాల స‌మ‌యం ఇవ్వ‌టం స‌రికాద‌ని జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారులు చెబుతున్నారు. విధానాల పేరుతో ప‌నుల‌కు ఆటంకం క‌లిగించేలా చేస్తే ప్రాజెక్టు ప‌నులు ఆల‌స్యం కావా? అన్న ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌లేదు. మొత్తంగా చూస్తే.. పోల‌వ‌రం ప‌నుల నిలిపివేత‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం వెనుక అస‌లు క‌థ వేరే ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్రం.. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ధ్య వ‌చ్చిన విభేదాలు ముదిరి తాజా ప‌రిస్థితి కార‌ణమ‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News