తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి.. నవ్యాంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలోకి ఇబ్బడిముబ్బడిగా వెళుతున్న నాయకులకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. 2019 ఎన్నికల నాటికి వారిలో సగం మంది మళ్లీ సొంత పార్టీల్లోకో ఇతర పార్టీల్లోకో చేరాల్సిన పరిస్థితులు రానున్నాయి. ఇందుకు కారణం.. శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పడమే.
రాష్ట్ర విభజనతోపాటే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కూడా ఇచ్చింది. అదేమిటంటే, రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను చేపట్టాలని సూచించింది. తెలంగాణలో ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 119. వాటిని 153కు పెంచాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175. వాటిని 225కు పెంచాలని సిఫారసు చేసింది. తద్వారా, తెలంగాణలో 34 నియోజకవర్గాలు పెరిగితే - నవ్యాంధ్రలో 50 నియోజకవర్గాలు పెరుగుతాయి. ఆ మేరకు నాయకులకు కూడా సీట్లు దక్కుతాయి. శాసనసభ నియోజకవర్గాల పునర్య్వవస్థీకరణ ఉందనే భరోసాతోనే చాలామంది అధికార పార్టీల్లోకి వెళుతున్నారు. అక్కడ తమ సీటుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఏదో ఒక నియోజకవర్గంలో తమను సర్దుబాటు చేస్తారని ఆశ పడుతున్నారు.
అయితే, ఆకర్ష్ నేతల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లేసింది. శాసనసభ నియోజకవర్గాల పునర్య్వవస్థీకరణ చేపట్టే అవకాశం లేదని, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని లోపాలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తేల్చి చెప్పేశారు. 2019 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్య్వవస్థీకరణ పూర్తి కాకపోతే ఆకర్స్ నేతలు మరో పార్టీని వెతుక్కోవాల్సిందే.