తన మాటను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నెగ్గించుకున్నారు. తను బ్రాండ్ ఇమేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పోలవరం ప్రాజెక్టు విషయంలో తన మాట వినిపించుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ తొలి దశను ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని, తద్వారా మైలేజీ పొందాలని సంకల్పించిన చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. పోలవరం నిర్మాణ పనులను నిదానంగా చేస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ నుంచి.. స్పిల్ వే - స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులను తప్పించి.. నవయుగ కంపెనీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. కేంద్ర జలవనుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఛాంబర్ లో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా పోలవరం నిర్మాణంలో ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది.
పోలవరం ప్రాజెక్టు పనులు చేయకుండా ముప్పుతిప్పలు పెడుతున్న ట్రాన్స్ ట్రాయ్ ను పక్కకు తప్పించి మరో కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించాలని కేంద్రం వద్ద సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున్నే ప్రయత్నం చేశారు. దాదాపు మూడున్నర నెలల క్రితమే ఈ పనులకు రాష్ట్రం కొత్త టెండర్లు పిలిచినా.. ట్రాన్స్‌ట్రాయ్ ఫిర్యాదుతో కేంద్రం అడ్డుకుంది. ట్రాన్స్ ట్రాయ్ పనులు చేయడం లేదని.. కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగిస్తేనే పనులు వేగంగా జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్రం వినలేదు. కొత్తగా టెండర్లు పిలిస్తే ఖర్చు పెరిగిపోతోందంటూ కేంద్రం వాదించడం మొదలుపెట్టింది. దీంతో.. నాగ్ పూర్ వెళ్లి మరీ నితిన్ గడ్కరీతో చర్చలు జరిపి.. పోలవరం ప్రాధాన్యతను ఏపీ సీఎం వివరించారు. అప్పటికీ.. ట్రాన్స్ ట్రాయ్ తో పనులకే కేంద్రం మొగ్గు చూపింది నెలరోజుల గడువు విధించింది. కానీ.. ఎప్పటిలానే టార్గెట్‌ను ట్రాన్స్‌ట్రాయ్ చేరుకోలేకపోయింది. ఈ విషయాలను ప్రస్తావిస్తూ రాష్ట్రం మరోమారు కేంద్రాన్ని ఆశ్రయించడంతో... కాంక్రీట్ పనులను నవయుగకు అప్పగించింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా.. నవయుగ యాజమాన్యంతో చర్చలు జరిపి.. పాత ధరలకే పనులు చేయడానికి అంగీకరించేలా ఒప్పించింది. దీనివల్ల కాంట్రాక్టర్ మారినా.. పైసా కూడా అదనపు భారం ప్రభుత్వంపై పడదు. ఈ విషయాన్నే నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వివరించారు అధికారులు. ఆయనా వెంటనే కాంట్రాక్టర్ మార్పుకు ఆమోదం తెలిపారు. ఇంతకాలం కాంట్రాక్ట్ సంస్థ మార్పుకు ఒప్పుకోని కేంద్రం..దీంతో ఏపీ సర్కార్ ఒత్తిడితో దిగి రావడంతో.. టార్గెట్ కల్లా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలవరంలో స్పిల్ వే - స్పిల్ చానల్ కు సంబంధించి 34.04 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా.. ఇంతవరకూ ట్రాన్స్‌ట్రాయ్ కేవలం 4.92 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులే చేసింది. తాజా నిర్ణయంతో మిగిలిన పనినంతా నవయుగ చేపట్టనుంది. ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా 2019 కల్లా వీటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. వారం రోజుల్లోగా ఒప్పందం పూర్తి చేసుకుని రంగంలోకి దిగనుంది నవయుగ. కాంట్రాక్టర్ మార్పుకు కేంద్రం ఎట్టకేలకు అంగీకరించడంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి తగ్గిపోయినట్లయ్యిందని అంటున్నారు.