లాక్ డౌన్ ఎఫెక్ట్: కేంద్రం మరో సంచలన నిర్ణయం..మరో కొత్త చట్టం!

Update: 2020-04-14 13:30 GMT
కరోనా వైరస్ ను దేశంలో వేగంగా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా ..తాజాగా మరోసారి 19 రోజుల పాటు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు ప్రధాని మోడీ తెలిపారు. దీనితో మే 3 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది. దీనితో ప్రజలందరూ మరికొన్ని రోజులు ఇళ్లకే పరిమితం కావాల్సిందే. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. వలస కూలీలు సొంతగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటికే పయనం అయ్యి వెళ్లిపోయారు.

కొంతమంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. చాలా ప్రాంతాలను ఇప్పటికే రెడ్ జోన్లుగా ప్రకటించారు. రెడ్ జోన్లుగా ప్రకటించిన కేంద్రాల్లో ప్రజలు ఎవరూ బయటకు రావడంలేదు. అయితే, ఏప్రిల్ 20 వ తేదీ తరువాత మరోసారి కేంద్రం కరోనా పై సమీక్ష నిర్వహించి , కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు తీసుకురావాలని చూస్తుంది. సడలించిన ప్రాంతాల్లో వ్యాపారలావాదేవీలు - పరిశ్రమలు నడిపేందుకు కృషి చేస్తుంది.

కాగా , ఏప్రిల్ 20 తరువాత కొన్ని పరిశ్రమలను ఓపెన్ చేస్తే అందులో పనిచేసేందుకు వచ్చే ఉద్యోగుల - కార్మికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్ కు తగినట్టుగా సప్లై చేయలేరు. దీనితో కార్మిక చట్టం లో మార్పు తీసుకువచ్చు ...రోజుకి 8 గంటలకి బదులుగా 12 గంటలు పనిచేసేలా చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది. కార్మిక చట్టం ప్రకారం రోజుకి 8 గంటల చొప్పున , వారానికి 48 గంటలకి మించి పని చేయించరాదనే ఒక నిబంధన ఉంది. అయితే, అత్యవసర సమయంలో వారానికి పని గంటలు 72 గంటలకి పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను కేంద్రం తీసుకురాబోతున్నది. ఫలితంగా మూడు షిఫ్ట్ లకు బదులుగా రెండు షిఫ్ట్ ల్లోనే పనులను పూర్తిచేయొచ్చు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
Tags:    

Similar News