ద‌ళిత్ అనే ప‌దాన్ని వాడొద్ద‌న్న కేంద్రం

Update: 2018-04-05 06:10 GMT
ఎస్సీ..ఎస్టీ కులాల‌కు సంబంధించిన వారిని ఉద్దేశిస్తూ ఏదైనా చెప్పాల్సి వ‌స్తే.. ద‌ళిత్ అంటూ అధికారిక ప‌త్రాల్లో పొందుప‌ర్చ‌టం స‌రికాద‌న్న మాట‌ను కేంద్రం స్ప‌ష్టం చేసింది. గ‌తంలో షెడ్యూల్ కులాల వారికి ఇచ్చే ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లో హ‌రిజ‌న్ అనే ప‌దాన్ని వాడేవారు. త‌ర్వాతి కాలంలో ఆ ప‌దాన్ని వాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యింటం.. ఆ మాట‌ను మాట్లాడ‌టం త‌ప్పేన‌ని తేల్చ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. గ‌డిచిన కొంత‌కాలంగా ఎస్సీ.. ఎస్టీ వ‌ర్గాల‌ను ప్ర‌స్తావించే స‌మ‌యంలోనూ.. వారికి అందించే ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లోనూ ద‌ళిత్ అనే ప‌దాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. ఇది స‌రికాదంటూ ఇటీవ‌ల గ్వాలియ‌ర్ ధ‌ర్మాస‌నం ఇచ్చిన తీర్పుతో పాటు.. కేంద్ర సామాజిక న్యాయం.. సాధికారిత మంత్రిత్వ శాఖ కొత్త నిర్ణ‌యాన్ని తీసుకున్నాయి.

దీని ప్ర‌కారం.. ఇక‌పై ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో షెడ్యూల్ కులాల్ని ప్ర‌స్తావించేట‌ప్పుడు వారిని ద‌ళిత్ అనే మాట‌ను వాడ‌కూడ‌ద‌ని తేల్చింది. అయితే.. షెడ్యూల్ కులాలు అని కానీ జాతీయ భాష‌ల్లో అందుకు స‌రిపోయేలా.. అదే అర్థాన్ని ఇచ్చేట‌టువంటి మ‌రో ప‌దాన్ని కానీ వాడాల‌ని నిర్ణ‌యించారు.

ఇక‌.. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లోనూ.. స‌ర్టిఫికేట్ల‌లోనూ షెడ్యూల్ క్యాస్ట్స్ లేదంటే అందుకు స‌రిగ్గా స‌రిపోయే ప‌దాన్ని వాడాల‌ని నిర్ణయించారు. ఎస్సీ.. ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన వ్య‌క్తుల గురించి చెప్పాల్సి వ‌చ్చిన‌ప్పుడు కూడా వారిని ఉద్దేశించి ద‌ళిత్ అన్న మాట‌ను వాడ‌కూడ‌ద‌ని తేల్చింది. రెండు వ‌ర్గీక‌ర‌ణాల్లోనూ వివిధ కులాల వారిని ద‌ళితులు అనే పేరుతో రాజ్యాంగంలో ఎక్క‌డా పేర్కొన‌లేద‌ని తేల్చింది. మొత్తంగా చూస్తే.. ద‌ళిత్ అనే ప‌దాన్ని ఎక్క‌డా వాడ‌కూడ‌ద‌ని కేంద్రం తాజాగా తేల్చి చెప్పింది.
Tags:    

Similar News