ప్ర‌తిప‌క్ష నేత‌ గా చంద్ర‌బాబు నాయుడు.. ఫెయిల్యూర్ స్టోరీ!

Update: 2019-12-11 10:16 GMT
ఆరు నెల‌ల వైఎస్ జ‌గ‌న్ పాల‌న గురించి తెలుగుదేశం పార్టీ త‌న‌కు తోచిన వ్యాఖ్యానాన్ని చెబుతూ ఉంది. జ‌గ‌న్ చేసిన మంచిని గురించి తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఒప్పుకోలేదు. ఇక జ‌గ‌న్ గురించి ఏదో ఒక విమ‌ర్శించాల‌న్న‌ట్టుగా ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్లు. అవి కూడా తీవ్ర‌మైన కామెంట్లు!

అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌వ‌చ్చు. అయితే ఆ విమ‌ర్శ‌ల్లో లాజిక్ ఉండాలి. లేక‌పోతే అంతే సంగ‌తులు. అందుకు ఉదాహ‌ర‌ణ‌లు కొన్ని చెప్ప‌వ‌చ్చు. ఐదేళ్ల కింద‌ట చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఆరు నెల‌ల‌ను పూర్తి చేసుకున్న‌ప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాల‌ను ప‌ట్టుకుని జ‌నాల్లోకి వెళ్లింది. అందులో ముఖ్య‌మైన‌ది చంద్ర‌బాబు నాయుడు హామీల‌ను నిల‌ బెట్టుకోలేదు అని అప్ప‌ట్లో వైసీపీ రోడ్డెక్కింది.

రైతు రుణ‌మాఫీ, డ్వాక్రా రుణ‌మాఫీల విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు మోసం చేశాడంటూ వైసీపీ రోడ్డెక్కింది. ఆయా వ‌ర్గాల నుంచి అప్పుడే ఆ పార్టీ కి మ‌ద్ద‌తు ల‌భించింది. జ‌గ‌న్ విష‌యంలో ఇప్పుడు టీడీపీ హామీలు నిల‌బెట్టుకోవ‌డం లేదంటూ గ‌ట్టిగా మాట్లాడానికి లేకుండా పోయింది. ఉన్నంతో జ‌గ‌న్ చాలా వ‌ర‌కూ హామీల‌ను నిల‌బెట్టుకుంటున్నారు. అంతేగాక ఉద్యోగాల క‌ల్ప‌న‌ లో జ‌గ‌న్ దుమ్ము రేపారు. దీంతో తెలుగు దేశానికి నోట‌మాట లేదు!

ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మిగిలిన ఆయుధాలు ఇంగ్లిష్ మీడియం ప్ర‌భుత్వ పాఠ‌శాలులు మాత్ర‌మే! దానిపై గ‌ట్టిగా మాట్ల‌డితే చంద్ర‌బాబు మీదే వ్య‌తిరేక‌త వ‌స్తుంది. ఇసుక ర‌చ్చ చేశారు కానీ, వ‌ర్షాలు త‌గ్గిపోగానే ఆ స‌మ‌స్య లేదు!

ఇక అమ‌రావ‌తి, త‌న పార్టీ నేత‌ల‌పై దాడులు అంటూ చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతున్నా వాటిని జ‌నాలు ప‌ట్టించుకోవ‌డం లేదు. అన్నింటికీ మించి అసెంబ్లీలో కూడా చంద్ర‌బాబు నాయుడుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెడుగుడు ఆడుకుంటున్నారు.

వైసీపీలో చురుకైన మాట‌ల‌తో, వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబు ను ఇర‌కాటంలో పెట్టే వాళ్లూ క‌నిపిస్తున్నారు. ప‌దునైన మాట‌ల‌తో చంద్ర‌బాబు నాయుడుకు తీవ్రంగా విమ‌ర్శించే వాళ్లూ క‌నిపిస్తున్నారు. స‌భ‌లో చంద్ర‌బాబు నాయుడుకు ఉన్న బ‌లం స్వ‌ల్ప‌మే. వారిలోనూ స‌గం మంది ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో అసెంబ్లీ లోనూ చంద్ర‌బాబుది ఫెయిల్యూర్ స్టోరీనే అవుతోంది.

అన్నింటికీ మించి చంద్ర‌బాబు నాయుడు బాగా అస‌హ‌నానికి లోన‌వుతూ ఉన్నారు. సావ‌ధానంగా, అంశాల వారీగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడ‌టం లేదు. చివ‌ర‌కు స్పీక‌ర్ మీద కూడా నోరుపారేసుకుని చంద్ర‌బాబు నాయుడు అభాసుపాల‌వుతున్నారు.

చంద్ర‌బాబు ఫెయిల్యూర్ స్టోరీ ఇంతటి తో కూడా ఆగ‌డం లేదు. లోకేష్ రూపంలో ఆయ‌న‌కు మ‌రో భారం ఉండ‌నే ఉంది. ఈ ప‌రిణామాల‌న్నింటిలోనూ చంద్ర‌బాబు నాయుడు అస‌హ‌న‌భ‌రితుడు అవుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. త‌న పార్టీ వాళ్ల‌తో స‌మావేశాల‌కు కూర్చున్న‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడు తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప్ర‌భుత్వం మీద, సీఎం జ‌గ‌న్ మీద విరుచుకుప‌డుతూ ఉన్నారు. అందుకు సంబంధించి లీకులు ఇస్తున్నారు. అక్క‌డ చంద్ర‌బాబు ఉప‌యోగించే బాష కూడా చాలా దారుణంగా ఉంటోంద‌ని స్ప‌ష్టం అవుతోంది. బహుశా అలా ఇష్టానుసారం మాట్లాడ‌టం త‌ప్ప చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు చేయ‌గ‌లిగింది కూడా లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు బీజేపీ ప్రాప‌కం కోసం చంద్ర‌బాబు నాయుడి ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. అలా యూట‌ర్న్ తీసుకోవ‌డం ఆయ‌న‌ను ప్ర‌జ‌ల్లో మ‌రింత ప‌లుచ‌న చేస్తూ ఉంది. ఏతావాతా ఆరు నెల‌ల ప్ర‌తిప‌క్ష వాసం చంద్ర‌బాబు నాయుడి పొలిటిక‌ల్ హిస్ట‌రీలోనే చాలా ఫెయిల్యూర్ చాప్ట‌ర్ లా సాగుతోంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News