తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తో. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీస్తోందని ఆగ్రహించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్నాక కూడా అదే ఒరవడి కొనసాగింది. టీడీపీ డైహార్డ్ ఫ్యాన్స్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా వ్యతిరేకిస్తారో తెలిసిందే. కానీ రాజకీయ అవసరాల కోసం ఏమైనా చేసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు.. మొన్నటి తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం అభిమానుల కు పెద్ద షాకే ఇచ్చాడు. కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ఎన్నికల్లో ప్రజా కూటమి ఘోర పరాజయం చవిచూసింది. ఈ దెబ్బతో పొత్తు మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందని అందరూ అనుకున్నారు.
చంద్రబాబు మనస్తత్వం తెలిసిందే కాబట్టి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు బాబు కు దూరం గా ఉంటున్నాయి. ఇలాంటి స్థితిలో చంద్రబాబు.. ఏఐసీసీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీని కలవడం చర్చనీయాంశమైంది. తాజా గా చెన్నైలో డీఎంకే మాజీ అధ్యక్షడు కరుణానిధి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తో పాటు సోనియా కూడా పాల్గొన్నారు. ఇద్దరూ పక్క పక్కన కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరూ నవ్వుతూ ముచ్చటించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యం లో టీడీపీ-కాంగ్రెస్ బంధం మున్ముందు ఎలా ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది. ఏపీ లో కూడా రెండు పార్టీల పొత్తు ఉంటుందా.. తెలంగాణ లో పార్లమెంటు ఎన్నికల్లో ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే ఇప్పుడు నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన చంద్రబాబును నమ్మడానికి లేదని కాంగ్రెస్ వర్గాలకు తెలియదా ఏంటి?