వైసీపీ క్షుద్ర రాజ‌కీయం: చంద్ర‌బాబు ఫైర్‌

Update: 2022-11-12 11:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క్షుద్ర రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా వైసీపీ మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలపై  చంద్రబాబు ధ్వజమెత్తారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ  కార్యాలయాన్ని ఖాళీ చేయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ''సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ బయటికి రాదా'' అని చంద్ర‌బాబు ప్రశ్నించారు.

తగలబెట్టడం, కూలగొట్టడం వంటి సంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంక బయటకు రాదా అని  చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన రెండు ఘటనలు.. వైసీపీ రాక్షస రాజకీయానికి నిదర్శనమని మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీ కార్యాలయం ఉన్న భవనాన్ని ఖాళీ చేయించడానికి స్వయంగా ఎస్పీ బలగాలతో వెళతారా అని నిలదీశారు.

ఐపీఎస్కు మీరు అర్హులేనా అని జిల్లా ఎస్పీని చంద్ర‌బాబు ప్రశ్నించారు. గుంతకల్లులో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని రాజకీయ కక్షతో తగలబెడతారా.. ఇదేనా మీ రాజకీయమని మండిపడ్డారు.

తగలబెట్టడం, కూలగొట్టడం వంటి తమ సాంప్రదాయ క్షుద్ర రాజకీయం నుంచి వైసీపీ ఇంక బయటకు రాదా? అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. వ‌రుస ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఆగ్ర‌హంతో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు తాజా ప‌రిణామాల‌పై మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News