ఇంట్లోనే టీడీపీ శ్రేణులు నిరసన తెలపాలి... అధినేత ఆదేశం !

Update: 2020-05-19 09:30 GMT
రాష్టంలో ఒకవైపు మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తుంది. అయితే, ఈ తరుణంలో రాష్ట్రంలో కరెంట్ బిల్లుల వ్యవహారం పెద్ద చర్చకు దారితీస్తుంది. కొన్ని జిల్లాల్లో వేలల్లో బిల్లులు వచ్చాయి. అయితే, దీనిపై ప్రభుత్వం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జూన్ చివరి వరకు ఎవరు కరెంట్ బిల్లు కట్టవద్దు అని సీఎం జగన్ తెలిపారు.

అయితే, రాష్ట్రంలో  విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకి  టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని  అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని తెలిపారు. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ నిరసన తెలియజేయాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. 3 , 4 రెట్లు విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నామని  చంద్రబాబు  అన్నారు. ప్రస్తుతం  క్లిష్ట పరిస్థితుల్లో ప్రజానీకం ఉంటే కరెంటు బిల్లులు పెంచడం హేయమని మండిపడ్డారు. అలాగే  దేశంలోని డిస్కమ్లకు కేంద్రం రూ. 90 వేల కోట్లు రాయితీలు ఇచ్చిందని , కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ధరలు దుర్మార్గమని ఆయన విమర్శించారు. టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని కూడా ప్రకటించనున్నారు.  ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి  .. ఒక్క అవకాశం అని అడిగి తీరా అవకాశం ఇచ్చాక మాట తప్పి కరెంట్ చార్జీలు పెంచడం దారుణమని చంద్రబాబు నాయుడు , సీఎం జగన్ పై  తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Tags:    

Similar News