జ‌గ‌న్‌ పై పైచేయి... బాబు ప్లాన్ ఇదే!

Update: 2017-11-02 12:48 GMT
ఏపీలో అధికార‌ - విప‌క్షాల మ‌ధ్య యుద్ధం.. మ‌ళ్లీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ నెల 6 నుంచి జ‌గ‌న్ పాద‌యాత్ర కు రెడీ అవుతున్నారు. అదేస‌మ‌యంలో ఈ నెల 10 నుంచి అధికార టీడీపీ అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైంది. మొత్తంగా ప‌ది రోజులు అసెంబ్లీ న‌డ‌పాల‌ని బాబు నిర్ణ‌యించారు. అయితే, దీనిని బాయ్ కాట్ చేయాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీనికి అదిరిపోయే రీజ‌న్ కూడా ఆయ‌న చెప్పేశారు. తమ పార్టీ నుంచి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ తో చంద్ర‌బాబు ప‌ట్టుకుపోయిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాల‌ని అందుకే అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

దీంతో బాబుకు ఇప్పుడు భ‌యం ప‌ట్టుకుంది. వైసీపీ నేత‌లు  అసెంబ్లీకి ఎందుకు రాలేదు? అని ఎవ‌రైనా అడిగితే రీజ‌న్ ఏం చెప్పాలి?  ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోలేదు కాబ‌ట్టి.. వైసీపీ రాలేద‌ని చెప్పాలి. మ‌రి బాబు అలా ఎందుకు చెబుతారు. పోనీ ఇత‌ర టీడీపీ నేత‌లేమైనా నోరు జార‌తారేమోన‌ని ఆయ‌న ముందుగానే అలెర్ట్ అయిపోయారు. ఈ క్ర‌మంలోనే నిన్న పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనికి హాజ‌రైన కీల‌క నేత‌ల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. జ‌గ‌న్ విష‌యంలో ఆచితూచి స్పందించాల‌ని చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీకి హాజ‌రు కావ‌డం లేద‌నే టాపిక్‌ పై అస్స‌లు మ‌నోళ్లు నోళ్లు తెర‌వ‌ద్ద‌ని ఆయ‌న హుకుం జారీ చేశారు.

ఇక‌, అదేస‌మ‌యంలో జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై మాత్రం పెద్ద ఎత్తున యాంటీ ప్ర‌చారం చేసేలా దిశానిర్దేశం చేశారు. అక్ర‌మ ఆదాయ కేసుల్లో ఏ1గా ఉన్న దొంగ మీ ద‌గ్గ‌ర‌కి వ‌స్తున్నాడు.. రానీయొద్ద‌ని - త‌లుపులు మూసుకుని ఇళ్ల‌లోనే ఉండాల‌ని - ఇప్పుడు మీ ఇళ్లు చూసి - దానిలో ఉన్న విలువైన వ‌స్తువులు చూస్తే.. వాటిని జ‌గ‌న్ కొట్టేస్తాడ‌ని ఇలా వ్యంగ్యం క‌ల‌గ‌లిపిన యాంటీ ప్ర‌చారంతో దంచి కొట్టాల‌ని బాబు త‌న త‌మ్ముళ్ల‌కు పక్కాగా నూరిపోశార‌ట‌. వ్యూహం ప్ర‌కారం విమ‌ర్శలు చేయాల‌ని - జ‌గ‌న్‌ ను తూర్పార‌బ‌ట్టాల‌ని దిశానిర్దేశం చేయ‌డం - అదేస‌మ‌యంలో అంసెబ్లీకి ఎందుకు రావ‌డం లేద‌నే కామెంట్ల‌ను ఎవాయిడ్ చేయాల‌ని సూచించ‌డం వంటివి బాబు వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి జ‌గ‌న్ అండ్ పార్టీ ఎలారియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News