నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం డిజైన్ల విషయంలో సుదీర్ఘంగా సాగిన కసరత్తుకు ఫుల్ స్టాప్ పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పలు సంస్థల డిజైన్లు పరిశీలించిన బాబు వేటికి మోక్షం కలిపించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24 - 25 తేదీల్లో సీఎం చంద్రబాబునాయుడు లండన్ లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అమరావతి నిర్మాణాలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్ 25న తుది డిజైన్లు ఇవ్వనున్నారు. ఈ భేటీకి ముందే ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి లండన్ లో పర్యటించి కీలక వర్క్ షాప్ లో భాగస్వామ్యం పంచుకోనున్నారు.
ఈరోజు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్ డీఏ సమావేశమయ్యింది. ఈ సందర్భంగా రాజధాని డిజైన్లపై చర్చ జరిగింది. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 11 - 12 - 13న లోండన్ లో అసెంబ్లీ - హైకోర్టు డిజైన్లపై వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు. సీఎం నివాసం - సచివాలయం - ఇతర ముఖ్య భవనాలకు 15రోజుల్లోపు డిజైన్లు పూర్తి అవుతాయన్నారు. లండన్ లో జరుగనున్న వర్క్ షాప్ కు దర్శకుడు రాజమౌళి హాజరవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులను ఏడాదిలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ)ద్వారా 18 ప్యాకేజీల్లో 16కు టెండర్లు పిలిచామని - సీఆర్డీఏకు సంబంధించిన పనులకు కూడా టెండర్లు పిలిచామన్నారు. అయితే ఐకానిక్ టవర్స్ కు టెండర్లు పిలవాల్సి ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు.
అమరావతిలో విద్యాలయాల ఏర్పాటుకు 25 అగ్రశ్రేణి సంస్థలు ముందుకొచ్చాయని, ఇప్పటికే 11 జాతీయ - అంతర్జాతీయ విద్యాసంస్థలు ప్రతిపాదనలు పంపినట్లుగా అధికారులు సీఎంకు తెలిపారని మంత్రి నారాయణ వివరించారు. రాజధానిలో ప్రతిష్టించనున్న ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణ వేగవంతం చేయాలనీ ఏడీసీకి సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు. కాగా, ఈ భేటీతో డిజైన్ల కసరత్తు కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.