ఇంతకూ చంద్రబాబునాయుడు కుటుంబ (అంటే చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు మాత్రం) ఆస్తుల విలువ ఎంత? ఆయన కుమారుడు లోకేష్ ఏటా తమ కుటుంబసభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ప్రకటిస్తూనే ఉన్నారు కదా..! అప్పట్లో ఎప్పుడూ మనకు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నట్లు అనిపించలేదే... మరిప్పుడు జాతీయ స్థాయిలో అందరు ముఖ్యమంత్రులకంటె చంద్రబాబునాయుడు ‘రిచ్ నెంబర్ వన్’ అనిపించుకుంటున్నారే అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
తమాషా ఏంటంటే.. గత ఏడేళ్లుగా ప్రతి సంవత్సరం చంద్రబాబు కుటుంబం తమ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది డిసెంబరులో కొడుకు లోకేష్ ఆస్తుల వివరాలను వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులందరి పేర్ల మీద ఎంతెంత విలువైన ఆస్తులు ఉన్నాయో విడివిడిగా తెలిపారు. ఆ లెక్కలకు ప్రస్తుతం అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ వెల్లడించిన వివరాలకు వ్యత్యాసం చాలా భారీగా ఉన్నదే అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. లోకేష్ ప్రకటించి.. నిండా రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే ఇంత ఆస్తులు పెరిగాయా అని అనుకుంటున్నారు.
గత ఏడాది లోకేష్ వెల్లడించిన ప్రకారం.. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తులు 2.53 కోట్లు కాగా అప్పులు 3.58 కోట్లు. ఆయన భార్య భువనేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తులు 25.41 కోట్లు మాత్రమే. అంతా కలిపితే.. పాతిక కోట్లు కూడా మించే అవకాశం లేదు.
అయితే తాజాగా వెల్లడైన దేశంలోని సీఎంల ఆస్తుల జాబితాలో మాత్రం చంద్రబాబునాయుడుకే అగ్రపీఠం దక్కింది. ఆయనకు భార్యకు కలిపి 177 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా ఈ సంస్థ నిగ్గు తేల్చింది. ఇప్పుడు ప్రజలకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఈ సంస్థ అబద్ధపు లెక్కలు చెబుతోంది... గత డిసెంబరులో లోకేష్ చెప్పినదానిలో అబద్ధాలున్నాయా? అనేది ప్రజల సందేహం. దీనిని తెదేపా వారు నివృత్తి చేయాల్సి ఉంది. లేకపోతే.. ప్రతి ఏటా ఆస్తుల వెల్లడి పేరుతో నారా వారి కుటుంబం.. ప్రజలను ఆ రకంగా కూడా మాయ లో పెడుతున్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది.