వెనుకా ముందు చూసుకోకుండా.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో..ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది.
ఆయన మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపుల వ్యవహారంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆయన.. ఇప్పుడు చాలా నిర్ణయాలు వేగంగా తీసేసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి ఉన్నతాధికారులే కాదు.. సొంత తమ్ముళ్లు (టీడీపీ ఎమ్మెల్యేలు) సైతం నొచ్చుకుంటున్న పరిస్థితి.
గతంలో ఏపీ సీఎంను కలవటానికి వచ్చే అధికారుల ఫోన్లను అనుమతించేవారు కాదు. తాజాగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫోన్లను వారితో తీసుకువెళ్లటానికి అధికారులు ససేమిరా అంటున్నారట. అదేమంటే.. కొత్తగా వచ్చిన ఆర్డర్స్ సార్ అంటూ వినయంగా చెబుతున్నారు. సొంతమనుషుల్ని కూడా నమ్మకపోవటం ఏమిటని పార్టీ ఎమ్మెల్యేలు వేదన చెందుతున్నట్లు చెబుతున్నారు. వదిలేస్తే పూర్తిగా వదిలేయటం.. లేదంటే అందుకు భిన్నంగా మనసులు గాయపడేలా వ్యవహరించటం ఏమిటంటూ పార్టీ నేతలు బాబుపై చిర్రుబుర్రులాడుతున్నారు.