పార్టీ ఫిరాయింపులు... ఈ మాట వింటే తొలుత టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తుకు వస్తే... ఆ వెంటనే టీడీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కూడా ఠక్కున గుర్తుకు వచ్చి తీరతారు. 2014 ఎన్నికల్లో క్లియర్ మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు... రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉండరాదన్న కసితో పార్టీ ఫిరాయింపులను తనదైన శైలిలో పరుగులు పెట్టించారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎంపీలు - మరికొందరు ఎమ్మెల్సీలను లాగేసిన చంద్రబాబు... పార్టీ ఫిరాయింపులకు కొత్త అర్థం చెప్పేశారు. అంతేనా... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఓ నలుగురికి ఏకంగా తన మంత్రివర్గంలో బెర్తులు ఇచ్చి చంద్రబాబు మరింత అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు.
సరే... ఇదంతా తెలిసిన కథే అయినా... ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే... పార్టీ ఫిరాయింపుల్లో తనదైన శైలి ముద్ర వేసిన చంద్రబాబు... ఇప్పుడు విపక్షంలోకి మారిపోగానే... ఫిరాయింపులు తప్పేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఎన్నికల్లో ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... నిన్న - నేడు అక్కడే పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సొంత లాభాలను చూసుకుని పార్టీ ఫిరాయిస్తే అది తప్పేనని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. స్వలాభం కోసం పార్టీ మారితే అది అవకాశవాదమే అవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సొంత లాభం కోసం కాకుండా నియోజకవర్గం అభివృద్ధి కోసమో - లేదంటే ఇంకేదైనా కారణంతోనే పార్టీ మారితే తప్పు లేదన్నట్లుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగానే సంచలనం రేకెత్తిస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్యేలు - ఎంపీలను తన పార్టీలో చేర్చుకున్న సమయంలో వారి చేతే... తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లుగా చంద్రబాబు చెప్పించిన వైనం గుర్తుంది కదా. ఆ మాటను ఇప్పుడు తానే స్వయంగా ప్రస్తావించిన చంద్రబాబు... స్వప్రయోజనాల కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారితే తప్పు లేదన్నట్లుగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది. తాను చేపట్టిన పార్టీ ఫిరాయింపులను ఎంతగా వెనకేసుకుని వచ్చినా కూడా చంద్రబాబు... పార్టీ ఫిరాయింపులు తప్పేనని చెప్పడం మాత్రం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. మరి పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇతర పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.