మొగుడు కొట్టినట్టే కొడితే.. పెండ్లాం ఏడిసినట్టే ఏడిసిందని ఒక సామెత కథ ఉంది.
ఇద్దరు కక్కుర్తి దంపతులున్నారు. ఎంగిలిచేత్తో కాకిని విదిలించరు. బంధువుల్లో ఎవరూ వారింట చేయికడిగిన పాపాన పోలేదు. అలాంటి ఇంటికి ఓ బంధువు పట్టుదలగా వచ్చాడు. ఎలాగైనా వారింటలో భోజనానికి ఉండాల్సిదే అని కూర్చుండిపోయారు.
భోజనం వేళయ్యాక.. వాడిని ఎలాగైనా తరిమేసి తాము తినాలని వారి ప్లాన్. కానీ వాడు కదలడాయె. అంతే ఆ భర్త ఉగ్రుడైపోయి.. భార్యను చితక బాదాడు. భార్యఏడుస్తూ శాపనార్థాలు ప్రారంభించింది. ఈ గోల చూసి.. బందువు నెమ్మదిగా జారుకున్నాడు. తర్వాత దంపతులిద్దరూ భోజనాల వద్ద కూర్చుని..
‘‘నేను కొట్టాలని కొట్టలేదే పెండ్లామా. అలా నటించాను’’ అని భర్త అంటే..
‘‘నేను ఏడవాలని ఏడవలేదు మొగుడా..? కేవలం అలా నటినంచాను’’ అని భార్య అన్నదిట.
ఈలోగా బంధువు తలుపుచాటునుంచి బయటకు వచ్చి.. ‘‘నేను వెళ్లాలని వెళ్లలేదు గానీ.. నాకూ ఒక ఆకు వేయండి..’’ అంటూ సహపంక్తి కూర్చున్నాడట.
==
ఈ కథమాదిరిగా ఉంది... భాజపా - తెలుగుదేశం మంత్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని మంత్రిపదవులకు చేసిన రాజీనామాల వ్యవహారం.
తెదేపా కేంద్రమంత్రులు రాజీనామాలు చేశారు. మంత్రి పదవులు మాత్రం వద్దట. కానీ ఎన్డీయేలో మాత్రం భాగస్వాములుగా ఉంటారట. చంద్రబాబునాయుడు సర్కారు కేసుల భయంతో.. వణికిపోతున్నారని అంతా అంటున్నారంటే అందులో అతిశయోక్తి కనిపించడం లేదు.
మంత్రి పదవులు వదిలేసుకుని ఎంపీలను మాత్రం అదే ఎన్డీయే కూటమిలో ఉంచి.. ఎవరి ప్రయోజనాలను సాధించాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
చంద్రబాబు తొలినుంచి స్వార్థ ఎజెండాతోనే పావులు కదుపుతున్నారని అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా.. మంత్రి పదవులకు రాజీనామా చేసి.. కూటమిలో కొనసాగడం అనేది అనైతికం మాత్రమే కాదు.. ప్రజల పట్ల చేస్తున్న మోసం అని పలువురు అంటున్నారు.