బుధవారం రాష్ట్రబంద్ కు చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు. ఇచ్చిన పిలుపు పూర్తవ్వగానే వెంటనే 36 గంటల పాటు నిరసన దీక్ష చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ టీడీపీ అధినేత నిరసన దీక్ష చేయాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత రెండు డౌట్లు వస్తున్నాయి.
అవేమిటంటే మొదటిదేమో బంద్ పూర్తిగా ఫెయిలైంది. రెండోదేమో తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగిందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటం. బంద్ విఫలం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు పిలుపుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తప్ప మామూలు జనాలు ఎవరూ స్పందించలేదు. వర్తక, వాణిజ్య వ్యవహరాలు మామూలుగానే జరిగాయి. ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగానే తిరిగాయి.
ఇదికాకుండా మధ్యలో బస్సులను టీడీపీ కార్యకర్తలు నిలిపేసినపుడు ప్రయాణీకులే టీడీపీ కార్యకర్తలతో కొన్నిచోట్ల గొడవకు దిగారు. బంద్ పాటించేది లేదని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు చంద్రబాబుకు స్పష్టంగానే తేల్చిచెప్పారు. ఇలా ఏ విధంగా చూసినా తానిచ్చిన బంద్ పిలుపు ఫెయిలైందని చంద్రబాబుకు అర్ధమైపోయింది. ఇక రెండో కారణం చూస్తే అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయటం. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతలు దాడులు చేశారు కాబట్టి వెంటనే వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చంద్రబాబు ఫిర్యాదుచేశారు.
ఇక్కడే చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నేతలపై తాను ఫిర్యాదు చేయగానే కేంద్ర హోంశాఖ మంత్రి చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ఎలా అనుకున్నారో అర్ధం కావటంలేదు. అపాయిట్మెంట్ ఇస్తే శనివారం ఢిల్లీకి వచ్చి జరిగిన దాడుల విషయాన్ని వివరిస్తానని చంద్రబాబు హోంమంత్రిని రిక్వెస్టు చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమిత్ షా ను కలవాలని చంద్రబాబు గడచిన రెండున్నరేళ్ళుగా ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. ఇపుడు కూడా అమిత్ షా పీఎస్ తోనే చంద్రబాబు మాట్లాడారట.
చంద్రబాబు ప్రయత్నాలకు నరేంద్రమోడి, అమిత్ ఎందుకు స్పందించటంలేదు ? ఎందుకంటే చంద్రబాబు ఎంతమాత్రం నమ్మదగ్గ వ్యక్తి కాదని మోడి, షా కు తెలిసిపోయిందని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. పైగా అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చినపుడు టీడీపీ నేతలు మంత్రి కారుపై కర్రలు, చెప్పులు, రాళ్ళతో చేసిన దాడి విషయాన్ని ఇంకా మరచిపోలేదట. అప్పట్లో తనపై చంద్రబాబు దాడిచేయించిన విషయం ఇంకా మరచిపోలేదు కాబట్టే అమిత్ పట్టించుకోవటంలేదంటున్నారు. అందుకనే ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు 36 గంటలకు నిరసన దీక్షకు దిగుతున్నట్లుంది.