ఢిల్లీకి బాబు!... ఎన్నెన్నో భ‌యాలు!

Update: 2019-02-27 05:44 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నేటి ఉద‌యం ఢిల్లీ ప‌ర్య‌ట‌నకు బ‌య‌లుదేరారు. కేంద్రంలోని బీజేపీయేర‌త‌ పార్టీల నేత‌ల‌తో స‌మావేశం కోస‌మే ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు...త‌న‌లో గూడు క‌ట్టుకుని ఉన్న ఎన్నెన్నో భ‌యాల‌ను ఆయా పార్టీల నేత‌ల ముందుంచుతార‌ట‌. మ‌రో వారంలో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల కానున్న ప‌రిస్థితుల్లో కేంద్రంలో అనుస‌రించాల్సిన వ్యూహాలు... బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు ఎన్నిక‌ల‌కు ముందుగానే పొత్తుల పై ప్ర‌ధానంగా చ‌ర్చించాల‌న్న ముఖ్య ఉద్దేశ్యంతోనే చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ సాగ‌నుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. దేశంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఇప్ప‌టికే త‌న‌దైన రీతిలో లెక్క‌లు వేసుకున్న చంద్ర‌బాబు...  ఈ ద‌ఫా కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవత‌రించ‌నుంద‌న్న భావ‌న‌కు వ‌చ్చార‌ట‌. మ‌రి తాను అనుకున్న మేర‌కే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రిస్తే... బీజేపీని - త‌న‌కు చుక్క‌లు చూపుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని అడ్డుకునేదెలా? అన్న‌దే ఇప్పుడు బాబు ముందు ఉన్న అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌.

ఎన్నిక‌ల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని అడ్డుకోవాలంటే... ఆ పార్టీకి వ‌చ్చిన సీట్ల కంటే అధికంగా సీట్లు ద‌క్కించుకునే పార్టీల కూట‌మి రంగంలోకి దిగాల్సిందే. అయితే ఈ కూట‌మి ఏర్పాటు ఎన్నిక‌ల త‌ర్వాత కాకుండా ఎన్నిక‌ల‌కు ముందుగానే త‌న ఏర్పాటు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు చంద్ర‌బాబు జ‌ట్టు క‌ట్ట‌నున్న పార్టీల‌న్నీ విడివిడిగానే ఉన్నాయి త‌ప్పించి కూట‌మిగా జ‌ట్టు క‌ట్ట‌లేదు. మ‌రి బీజేపీని - మోదీని అడ్డుకోవ‌డ‌మెలా? ఈ త‌ర‌హా క్లిష్ట స‌మ‌స్యల‌ను ఎంత త్వ‌ర‌గా వీల‌యితే... అంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించుకోవ‌డంతో పాటుగా యూపీఏ స్థానంలో పీపీఏనను రంగంలోకి దించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు టూర్ ప్లాన్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో యూపీఏకు వ్య‌తిరేకంగా రంగంలోకి దిగిన ఎన్డీఏ మిత్రుడిగా ఉన్న చంద్ర‌బాబు... ఐదేళ్లు తిర‌క్క‌ముందే... ఎన్డీఏకు శ‌త్రువుగా మారిపోయారు. యూపీఏకు మిత్రుడిగా మారిపోయారు. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో యూపీఏను విమ‌ర్శిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని సాగించిన నేప‌థ్యంతో పాటు యూపీఏపై జ‌నాల్లో ఉన్న అప‌ప్ర‌ద‌ను మ‌రోమారు గుర్తు చేయ‌కుండా ఉండేందుకు ఏకంగా యూపీఏ పేరును పీపుల్స్ ప్రొగ్రెసివ్ అల‌యెన్స్ (పీపీఏ)గా మార్చేందుకు రంగం సిద్ధ‌మైపోయిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి మ‌రింత క్లారిటీ ఇవ్వ‌డంతో పాటుగా పీపీఏ కూర్పు ఎన్నిక‌ల నాటికి కార్య‌రూపం దాల్చ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ముందుకు సాగుతున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందే పీపీఏ రంగంలోకి దిగ‌క‌పోతే.. ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీని - ప్ర‌త్యేకించి మోదీని అడ్డుకోవ‌డం దుస్సాధ్య‌మేన‌న్న‌ది బాబు భావ‌న‌గా తెలుస్తోంది. ఇదే ప్ర‌ధాన అజెండాగా ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్ర‌బాబు... తాను భేటీ కాబోయే అన్ని పార్టీల నేత‌ల వ‌ద్దా త‌న భ‌యాల‌ను ఏక‌రువు పెట్ట‌నున్నారు. అయితే తాను ఏక‌రువు పెట్టే ఈ భ‌యాల‌ను ప‌ట్టించుకునే స్థాయిలో ఇత‌ర పార్టీల నేత‌లు ఉన్నారా? అన్న‌ది బాబులోని మ‌రో భ‌యంగా తెలుస్తోంది. మోదీ మ‌రోమారు గ‌ద్దెనెక్క‌కుండా అడ్డుకోవ‌డమే ల‌క్ష్యంగా మిలిగిన పార్టీలు కూడా వ్యూహ ర‌చ‌న చేస్తున్నా.. బాబు భ‌య‌ప‌డినంత‌గా ఆ పార్టీల నేత‌లు భ‌య‌ప‌డ‌టం లేదు. ఎన్నిక‌ల్లో బీజేపీకి వీల‌యిన‌న్ని త‌క్కువ సీట్ల‌కే ప‌రిమితం చేసేలా ఆయా పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే ఆ విష‌యాన్ని మ‌రిచిన చంద్ర‌బాబు... ఎన్నిక‌ల్లో ఎలాగూ బీజేపీని అడ్డుకునే ద‌మ్ము లేద‌ని ఫిక్స్ అయిపోయి... ఎక్కువ సీట్లు వ‌చ్చినా మోదీని అడ్డుకునేదెలా? అన్న దిశ‌గా ఆలోచ‌న చేస్తుండ‌టం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. మొత్తంగా ఎన్నెన్నో భ‌యాల‌తో ఢిల్లీ బ‌య‌లుదేరిన చంద్ర‌బాబు.. ఆ భ‌యాలకు ఎలా ప‌రిష్కారం క‌నుగొంటారో చూడాలి.


Tags:    

Similar News