కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు నిజంగానే పండుగ వచ్చేసింది. ఎందుకంటే... సుదీర్ఘ కాలంగా అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న అభివృద్ధి పనులకు ఒక్కసారిగా జెట్ స్పీడు వచ్చేసింది. నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే మంజూరై అటకెక్కిన పనులకు నిధులు మంజూరు కాగా... అక్కడి ప్రజలు అడిగిందే తడవుగా కొత్తగా పనులు మంజూరవుతున్నాయి. ఈ పనులకు అయ్యే నిధులు ఏ వేలో, లక్షలో కాదు... ఏకంగా కోట్లలో ఉంటున్నాయి. అయినా కూడా టీడీపీ సర్కారు ముందూ వెనుకా చూడకుండా నిధులకు మంజూరు పత్రాలు ఇచ్చేస్తోంది. అప్పటిదాకా సింగిల్ పైసా కూడా విడుదల కాని నిధులు... ఇప్పుడు అడిగిందే తడవుగా నిధుల వరద పారుతున్న వైనానికి గల కారణాలు తెలియనివేమీ కాదు. ఎందుకంటే... త్వరలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరనుంది. దివంగత నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
గడచిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన భూమా... ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. మంత్రి పదవి కూడా దక్కుతుందనుకున్న తరుణంలో ఆయన గుండెపోటు కారణంగా హఠాన్మరణానికి గురయ్యారు. ఇక ఉప ఎన్నిక విషయానికి వస్తే... టీడీపీ అభ్యర్థిగా భూమా వారసుడిగా రంగంలోకి దిగిన భూమా బ్రహ్మానందరెడ్డి బరిలోకి దిగుతుండగా, వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేరు ఖరారైంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలే తరువాయిగా మారింది. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల బైపోల్స్‌లో విజయం సాధించి రెట్టించిన ఉత్సాహంతో తదుపరి అధికారం కూడా తమదేనని ధీమాతో సాగాలని టీడీపీ భావిస్తోంది. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మందీ మార్బలాన్ని రంగంలోకి దించేశారు.
అంతేకాకుండా ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు పెద్ద సంఖ్యలో నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో పరిస్థితి ఎలాగున్నా... నంద్యాల నియోజకవర్గంలో పేదలకు గృహాలు కట్టించి ఇచ్చేందుకు ఏకంగా ప్రభుత్వ భూమిని ఎంపిక చేశారు. నియోజకవర్గ పరిధిలో జలవనరుల శాఖకు చెందిన 49 ఎకరాల భూమిని గృహ నిర్మాణ శాఖకు బదలాయిస్తూ నిన్న చంద్రబాబు సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో అంతే భూమిని సేకరించి జలవనరుల శాఖకు అప్పగించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అంటే... అభివృద్ధి పనులు కావాలని అడుగుతున్న చోటామోటా పననేతలకు నిధులు అందజేస్తున్న టీడీపీ సర్కారు... పేదలు అడక్కుండానే వారికి ఇళ్లు కట్టించేందుకు రంగం సిద్ధం చేసిందన్న మాట. మరి ఇన్ని పనులు జరుగుతున్న నంద్యాలకు పండుగ వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాదేమో. అంటే ఉప ఎన్నికల్లో ఓడిపోతామన్న చంద్రబాబు భయమే... నంద్యాల ఓటర్ల పాలిట పండుగగా మారిందన్న వాదన వినిపిస్తోంది.