అదిరిపోయిన చంద్రన్న దసరా కానుక

Update: 2015-10-20 04:39 GMT
ఆ మధ్యన చంద్రన్న సంక్రాంతి కానుక అంటూ నిత్యవసర వస్తువుల్ని ఉచితంగా అందజేసి అందరి మనసులు దోచుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖలో పని చేసే కూలీలకు దసరా కానుక ఇచ్చి ఉక్కిరిబిక్కిరి చేశారు.

పౌరసరఫరాల శాఖలోపని చేసే కూలీలకు చంద్రన్న దసరా కానుక ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా రూ.3వేల నగదు.. రెండు జతల బట్టలతో పాటు.. కేజీ స్వీటు చేతిలో పెట్టేసరికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఈ భారీ దసరా కానుకను మంత్రులు పరిటాల సునీత.. పీతల సుజాత.. కిమిడి మృణాళినిఅందజేశారు. ఊహించని రీతిలో ఇంత భారీగా దసరా కానుకను పొందటం పౌరసరఫరాల శాఖ కూలీలు విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానుకలతో మనసులు ఎలా కొల్లగొట్టాలో ఏపీ సర్కారుకు బాగానే అలవాటైనట్లుందే.
Tags:    

Similar News