తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులుగా నారా చంద్రబాబు నాయుడు-కే చంద్రశేఖర్ రావు ఉప్పు-నిప్పు స్థాయి నుంచి పాలు నీళ్లలాంటి సఖ్యత స్థాయికి చేరుకోవడం అన్నివర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించిందే. అత్యంత ఆత్మీయులు అయినప్పటికీ ఆది నుంచి ఇద్దరూ ఉద్ధండులైన రాజకీయ నాయకులు కాబట్టి ఎవరి వ్యూహాలు వారికుంటాయనేది కాదనలేని నిజం. పైగా పాలనపగ్గాలు చేపట్టిన నేతలుగా ఒకరి నిర్ణయాలు మరొకరిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంటాయి. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయం బాబును ఇరకాటంలో పడేసింది.
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ - ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై కేసీఆర్ క్యాబినెట్ పూర్తి సానుకూల నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల ముందు ఆ రెండు వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు క్యాబినెట్ లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సీఎం చంద్రబాబునాయుడు కూడా తమ విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఏపీలో దాదాపు 70 వేల మంది కాంట్రాక్టు - ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ భరోసాతో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను తాము అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తామని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తామని బాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆ రెండు వర్గాలకు అనుకూల నిర్ణయం తీసుకోవడంతో, ఆ ఒత్తిడి ఇక బాబుపైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ కు పోటీగా బాబు కూడా ఏపీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. అంతకుముందు ఎన్జీఓ విషయంలోనూ ఇద్దరు సీఎంలు పోటాపోటీగా ఫిట్ మెంట్ పెంచారు. ఆ తర్వాత హైదరాబాద్ లో పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ స్పందించి, అనూహ్య స్థాయిలో వేతనాలు పెంచారు. కానీ ఏపీలో మాత్రం ఆ స్థాయిలో పెంచలేదు. తెలంగాణలో మున్సిపల్ - జడ్పీ చైర్మన్లు - ఎంపిటీసీ - జడ్పీటీసీ - కౌన్సిలర్లు - కార్పొ రేటర్లకు భారీ స్థాయిలో వేతనాలు పెంచినా, బాబు మాత్రం ఏపీలో ఇంకా వారి వేతనాలు పెంచలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధులు చంద్రబాబు కూడా కేసీఆర్ మాదిరిగానే తమకూ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహారం ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిన సామెత గుర్తుచేస్తోందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం తమ విషయంలోనూ అమలుచేయాలన్న భావన ఏపీ వర్గాల్లో కనిపిస్తుండటం ఆర్థికంగా లోటు బడ్జెట్‌లో ఉన్న చంద్రబాబు సర్కారుకు ఇబ్బందికరమైనదే.ఆర్థికవేత్త అయిన చంద్రబాబు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోనున్నారో మరి.