తెలుగుజాతి తెలుగుదేశం ఒక‌టి కాదు బాబూ!

Update: 2018-05-01 08:40 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. నేను ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకుంటారు. ఆయ‌న ఆంగ్లం అదోర‌కం. దానిపై సెటైర్లు ప‌డితే చంద్ర‌బాబు చ‌దివింది తెలుగు మీడియంలో క‌దా అంటారు. స‌రే మ‌రి తెలుగులో 40 అనుభ‌వ‌మున్న నాయ‌కుడు ఎలా మాట్లాడుతారో నిన్ననే చూశాం.

కొడుకేమో జ‌యంతిని వ‌ర్ధంతి అంటాడు. ఆయ‌నది పొర‌పాటు అనుకుందామంటే ఈ అనుభ‌వ‌జ్ఞుడు మాత్రం ఏకంగా బ్రిటిష్ వాళ్ల‌పై పోరాడింది తెలుగుదేశం పార్టీ అని ఏకంగా బ‌హిరంగ స‌భ సాక్షిగా వ్యాఖ్యానించారు. రాజ‌కీయ‌నాయ‌కుల‌న్నాక ఒక‌టో రెండో అబ‌ద్ధాలు చెప్ప‌డం మామూలే గాని టీడీపీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు చెప్పేవి మాత్రం మ‌రీ తెలుగుదేశం నేత‌లు  మొహ‌మాట ప‌డేలా ఉంటాయి. ప‌దే ప‌దే ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను సాక్ష్యాల‌తో చూపించినా బాబు మార‌ట్లేదు. అంటే, క‌చ్చితంగా ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగా అబ‌ద్ధాలు చెబుతున్న‌ట్లే క‌దా. అందుకే ఒక‌పుడు టెక్నాల‌జీ కింగ్ అనిపించుకున్న చంద్ర‌బాబు... టెక్నాల‌జీ విప్ల‌వం నుంచి పుట్టిన‌ సోష‌ల్ మీడియాలో ట్రోల‌ర్స్‌ కు బంతిలా మారాడు.

తెలుగుజాతి చేసిన ఏ పోరాటాన్న‌యినా తెలుగుదేశం ఖాతాలో వేయ‌డానికి చంద్ర‌బాబు ఏ మాత్రం వెనుకాడ‌డు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అయిన కాంగ్రెస్ త‌మ‌ది స్వాతంత్ర్యం సాధించిన పార్టీ అని అబ‌ద్ధం (గాంధీ-నెహ్రూల‌తోనే ఒరిజిన‌ల్ కాంగ్రెస్ ఖ‌త‌మైంది) చెప్పుకుని బ‌తికేస్తుంది. ఇక దాన్నుంచి పుట్టిన చంద్ర‌బాబుకూ అవే ల‌క్ష‌ణాలు అబ్బాయి. ఇందిరా గాంధీపైన‌, రాజీవ్‌ గాంధీపైన పోరాడిన ఘ‌నత మాది అని చెబుతున్న చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రు అధికారంలో ఉన్న‌పుడు కాంగ్రెస్ స‌భ్యుడు. కాంగ్రెస్ స‌భ్యుడు కాంగ్రెస్‌ పై పోరాడ‌టం ఏంటో ఏమో.. వినేవాడుంటే ఎంత సొల్ల‌యినా చెబుతాడు చంద్ర‌బాబు అని వైసీపీ నేత నాని ఏకిపారేశాడు.

అయితే, నిన్న చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య సోష‌ల్ మీడియాలో మ‌రోసారి హాట్ ట్రోల్ అయ్యింది. బ్రిటిష్ వాళ్ల‌పైనే పోరాడిన తెలుగుదేశం పార్టీ అని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు భారీగా స్పందిస్తున్నారు.

*స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి పింఛ‌ను బాబు గారికి ఇస్తున్నారా? లేదా?* అని ఒక‌రు ట్రోల్ చేస్తే

*బ్రిటిష్ పై పోరాడిన ఆ పార్టీ అధ్య‌క్షుడికి భార‌త ప్ర‌భుత్వం ఇచ్చిన రెండెక‌రాల భూమిలోనే క‌ష్ట‌ప‌డి ఎదిగి వేల కోట్ల స్థాయికి వ‌చ్చారు* అని ఇంకొక‌రు స్పందించారు.

*గాంధీ వెనుక బాబు... వెన్నుపోటుకేనా* అని ఇంకో నెటిజ‌న్ ఏకంగా గాంధీని మార్ఫ్ చేసి చంద్ర‌బాబుని అందులో పెట్టారు.

చంద్ర‌బాబు రాష్ట్ర సాధికార‌త సాధ‌న పోరాటంలో బాగా వెనుక‌ప‌డి పోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌క ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారు. జ‌గ‌న్ చంద్ర‌బాబును తిడితే మోడీని తిట్టాలి న‌న్ను కాదు అంటారు. బాబును విమ‌ర్శించ‌డంలో త‌ప్పు లేదు. ఎందుకంటే నేనున్నాను మీకు అన్నీ తెస్తా అని ఇపుడు చేతులెత్తేస్తే అది బాబు వైఫ‌ల్యం కాదా అన్న‌ది వైసీపీ వాద‌న‌. నీ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల క‌లిగిన న‌ష్టానికి నిన్ను తిట్ట‌డంలో త‌ప్పేముందన్న‌ది జ‌గ‌న్ మాట‌. కానీ చాలా తెలివిగా మోడీ బూచి చూపి జ‌గ‌న్ మీద బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చంద్ర‌బాబు. అయితే, ప‌రిస్థితి చేయిదాటడంతో తప్ప‌ని ప‌రిస్థితుల్లో ఇతరుల‌ను తిట్టే తొంద‌ర పాటు లో బాబు తాను ప‌ప్పులో కాలేస్తున్నారు. జ‌గ‌న్ గురించి ఆలోచించ‌డం మానేసి రాష్ట్రం గురించి ఆలోచిస్తే కొంత‌యినా మేలు జ‌రుగుతుంది ఏపీకి. ఈ విషయం బాబు తెలుసుకుంటే అంద‌రికీ మంచిది.
Tags:    

Similar News