ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో చాలా కచ్చితంగా ఉంటారు. తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఆయన తన తీరును మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. అదే సమయంలో ఆయనలో మరోకోణం ఉంది. ఏదైనా విషయంలో రచ్చ జరుగుతుందన్న భయంతో అసలు ఆ విషయాన్ని టచ్ చేయటానికి కూడా ఇష్టపడరు. ఒకే మనిషిలో ఇలా భిన్నకోణాలు బాబులో కనిపిస్తాయి.
విమర్శలకు భయపడే బాబు.. కొన్ని విషయాల్లో మాత్రం తనపై వచ్చే విమర్శల్ని అస్సలు పట్టించుకోరు. విదేశీ పర్యటనలకు.. విమాన ప్రయాణాలకు ప్రత్యేక విమానాల్ని వినియోగిస్తున్నారని.. దీని కారణంగా చాలా ప్రజాధనం వృధా అవుతుందంటూ ఆయనపై చాలానే విమర్శలు వచ్చాయి. తాజాగా చైనాకు వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక విమానంలోనే వెళ్లటం గమనార్హం.
ఖర్చు విషయంలో తనను తప్పు పడుతున్నా.. బాబు ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు షెడ్యూల్ కంటే మూడు గంటల ఆలస్యంగా చైనాగడ్డ మీద కాలు మోపారు. వాతావరణంలో ఉన్న ఇబ్బందుల కారణంగా ప్రయాణం ఆలస్యం అయ్యిందని చెబుతున్నారు. చైనాకు వెళ్లిన బాబుతో పాటు.. మంత్రులు యనమల రామకృష్ణుడు.. అచ్చెన్నాయుడు.. ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు.. మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్.. పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు.
చైనాలో పారిశ్రామికవేత్తల్ని కలిసి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకే చైనా పర్యటనకు బాబు వెళ్లారు. చైనా పారిశ్రామికవేత్తలకు మరింత సులువుగా అర్థమయ్యేందుకు చైనీస్‌లో ఏపీ రాజధానికి సంబంధించిన ప్రజంటేషన్‌ను తయారు చేసినట్లు చెబుతున్నారు. బాబు తన చైనా పర్యటనలో పలువురు చైనా పారిశ్రామికవేత్తల్ని కలుసుకోనున్నారు.