ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని అమరావతికి రావాలంటూ చైనీయులను ఆహ్వానించారు. తన చైనా పర్యటనలో మూడోరోజున ఆయన చైనా హార్బర్ ఇంజనీర్ కంపెనీ బృందంతో, అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ కొత్త రాజధాని అమరావతికి రావాలని, అక్కడ మీ కార్యాలయాన్ని ప్రారంభించాలని వారిని కోరారు. ఏపీలో అన్ని రకాల వసతులు ఉన్నాయని.. గనులు, తీరప్రాంతం, మానవ వనరులు, విద్యుత్ అన్నీ అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. అమరావతి చారిత్రక, ఆధ్యాత్మిక విశేషాలను వారికి వివరించారు.
మౌలికవసతుల కల్పన, పోర్టు నిర్మాణాల్లో తమకు మంచి అనుభవం ఉందని, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కూడా తాము సిద్ధమని చైనా హార్బర్ ఇంజనీర్ కంపెనీ చైర్మన్ వెన్ చెప్పారు. భారత్, ఏపీలో పోర్టుల నిర్మాణానికి అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఏపీలో చైనా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధిలో మీకు అపార అనుభవం ఉందని, ఏపీ కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టు రాజ్యంలో చంద్రబాబు ఆధ్యాత్మిక ఆహ్వానం ఆశ్చర్యకరమే మరి.