రేవంత్ రెడ్డి కాంగ్రెసులోకి ఫిరాయించే వ్యవహారం.. ఇక సంశయాలు ఏమీ లేకుండా తేలిపోయినట్లే. పొమ్మనకుండా పొగబెట్టే నీతిలో ఆరితేరిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆదిశగా ఓ స్టెప్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి మరికొన్నాళ్లపాటూ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా వెలగబెడుతూ.. ఆ హోదాతో కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం లేకుండా.. అన్నీ కత్తింరించేశారు. సింపుల్ గాచెప్పాలంటే.. రేవంత్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేయడం ఒక్కటే తక్కువ. దాదాపుగా అంత పనీ చే శారు. ఆయనను కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే చూడాలి తప్ప.. ఏ ఇతర బాధ్యత - అధికార హోదా ఉన్న పార్టీ నాయకుడిగా చూడడానికి వీల్లేదంటూ ఆయన తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఫోనులో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెళ్లిపోవడానికి తెలుగుదేశం అధిష్టానమే ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వాతావరణం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మంతనాలు సాగించివచ్చిన తర్వాత.. రోజులు గడుస్తున్నాయే గానీ, ఆయన తన చేరికకు ముహూర్తం ఎన్నడో తేల్చడం లేదు. కనీసం పార్టీ మారబోతున్నట్లు కూడా తేల్చడం లేదు. ప్రజలే తనకు అధిష్టానం అని.. తాను చెప్పదలచుకున్న అన్ని విషయాలూ చంద్రబాబు వచ్చిన తర్వాతనే.. ఆయనతోనే చెబుతానని, అప్పుడు నిర్ణయం తీసుకుంటానని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కానీ చంద్రబాబునాయుడు ఈ విషయంలో కాస్త కఠిన వైఖరిని ప్రదర్శించినట్లు కనిపిస్తోంది. రేవంత్ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన అధికారాలకు కోత పెట్టేశారు. పార్టీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. విదేశీ పర్యటననుంచి తిరిగి వచ్చిన తర్వాత.. రేవంత్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. సీనియర్లను చాలా మందిని పక్కన పెట్టి.. రేవంత్ రెడ్డిని చంద్రబాబునాయుడు నెత్తిన పెట్టుకున్నంనదుకు బహుశా ఇప్పుడు పశ్చాత్తాపపడుతుంటారని పలువురు తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లడమే ఏదో పెద్ద అర్హత అయినట్లుగా.. చంద్రబాబునాయుడు ఆయనను స్థాయికి మించిన పదవిలో కూర్చుండబెట్టారని, ఆ హోదాను అడ్డుపెట్టుకుని రేవంత్.. కాంగ్రెస్ తో బేరం ఫైనలైజ్ చేసుకున్నాడనే విమర్శలు వినవస్తున్నాయి. అయితే చంద్రబాబునాయుడు తాజా నిర్ణయం మీద రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవైపు ఆయన టీడీఎల్పీ సమావేశానికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అధికారాల కోత ప్రభావం ఎలా ఉంటుందో గమనించాలి.