పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం నా జీవిత ఆశయం. అందుకే ప్రత్యేకంగా వారంలో ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చాను. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వేగంగా ముందుకు సాగుతాను-- ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పే మాట. అయితే బాబుకు అదే కేంద్ర ప్రభుత్వం నుంచి దిమ్మతిరిగిపోయే రిప్లై వచ్చింది. పోలవరం నిర్మాణానికి సంబంధించి 2014, ఏప్రిల్ లో కేంద్రానికి పంపిన అంచనా వ్యయాన్నే పరిగణనలోకి తీసుకుంటా మని - అంచనా వ్యయం పెరిగితే కేంద్రం దాన్ని భరించలేదని, ఆ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి ఉమాభారతి తేల్చిచెప్పారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరరావు అడిగిన ప్రశ్నకు `లిఖితపూర్వకంగా` కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. నవ్యాంధ్ర జీవనాడి పోలవరంపై మరోసారి కేంద్రం తన వైఖరి స్పష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కేంద్రం పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా, తామే నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. తొలుత విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన పోలవరం నిర్మాణానికి నూరు శాతం నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం గత నెలలో తీర్మానించింది. ప్రాజెక్టు పర్యవేక్షణ మినహా పూర్తి బాధ్యతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ చేతుల్లో పెట్టింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సేద్యపు నీటి విభాగానికి సంబంధించి 2014 ఏప్రిల్ 1వ తేదీ నాటి నిర్మాణ వ్యయ అంచనాల ప్రకారం నూటికి నూరు శాతం నిధులు సమకూర్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపడుతుందని, అయితే ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతతో పాటు పనుల నాణ్యత, డిజైన్లు, పర్యవేక్షణ, అవసరమైన అనుమతుల సేకరణ వంటి అంశాలన్నింటినీ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖలో అంతర్భాగంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ చేపడుతుందని కేంద్రం ప్రకటించింది. ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2014 నాటి అంచనాల మేరకు నూరు శాతం నిధులు ఇస్తామని మంత్రివర్గం తీర్మానించిన సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలోనే జాతీయ ప్రాజెక్టు గుర్తించారని, తిరిగి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఏమిటంటూ విపక్షాలు ప్రశ్నించాయి. తెలుగుదేశం నేతలు మాత్రం కేంద్రం చట్టబద్దతపై హర్షం ప్రకటించారు.
తాజా ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై దోబుచులాడుతున్న విషయం అవగతమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని నిపుణులు పేర్కొంటున్నారు. 1.04.2014 నాటికి అంచనా విలువ ఎంత ఉందో అప్పటి వరకు ఖర్చు చేసిన సొమ్ము మినహా మిగిలిన నిధులను నూరు శాతం నిధులను విడుదల చేస్తామని చెప్పింది. 2014న పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16,010.95 కోట్లు. ఈ అంచనా వ్యయంతో సేద్యపు నీటి విభాగానికి సంబంధించిన వ్యయం వరకే కేంద్రం భరించనుంది. అంటే ప్రాజెక్టు అంచనాలో రూ.14 వేల కోట్లు మాత్రమే కేంద్రం రాష్ట్రానికి చెల్లించనుంది. ఈ అంచనా వ్యయంలో ఇప్పటికే రూ.8,081.79 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.5,135 కోట్లు ఖర్చు చేశారు. 2014 మే నుంచి 2017 జనవరి వరకు రూ.3,349.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,916.54 కోట్లు విడుదల చేసింది. జనవరి చివరి వరకు పోలవరం ప్రాజెక్టుపై రూ.8,898.39 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన ప్రకారం చూస్తే సుమారు రూ.5 వేల కోట్లు మాత్రమే పోలవరం నిర్మాణానికి ఇవ్వనున్నట్లు స్పష్టమవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలను పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా 2019 నాటికి రూ.32వేల కోట్లు అవుతుందని కేంద్రానికి నివేదిక పంపింది. పనులు జాప్యం జరిగితే అంచనా వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.. సవరించిన అంచనాలకు అనుగుణంగా నిధులు విడుదల చేయకపోతే పోలవరం నిర్మాణం 2019 నాటికి పూర్తి కావడం ప్రశ్నార్థకమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/