తాజాగా ముగిసిన ఎన్నికల్లో అప్పటిదాకా విపక్షంలో కూర్చున్న వైసీపీ బంపర్ విక్టరీ కొట్టేసింది. అంతేకాకుండా అప్పటిదాకా అధికారంలో ఉండి మరోమారు తమదే అధికారమని ధీమాగా ఉన్న టీడీపీకి తన చరిత్రలోనే ఎరుగనంత ఘోర పరాభవం దక్కింది. ఈ నేపథ్యంలో అసలు తమ లెక్క ఎక్కడ తప్పిందని టీడీపీ నేతలు... ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. ఫలితాలు - వాటి పర్యవసానాలు కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా... వాస్తవాలను ఒప్పుకునేందుకు సిద్ధంగా లేని చంద్రబాబు... 23 సీట్లే ఇచ్చేంత తప్పు తానేం చేశానంటూ ప్రజలపై నిష్టూరమాడుతున్నారు. సరే... మరి ఎన్నికల తర్వాత తొలిసారిగా భేటీ అయిన టీడీపీ పోలిట్ బ్యూరో... ఎన్నికల ఫలితాలకు కారణాలేమిటన్న విషయంపై ఓ అంచనాకు వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత తీవ్ర నిరాశలో కూరుకుపోయిన చంద్రబాబు ఎట్టకేలకు శుక్రవారం పోలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. ఈ బేటీలో చాలా అంశాలే ప్రస్తావనకు వచ్చినా... ఎన్నికల్లో పార్టీకి దక్కిన ఘోర పరాభవానికి గల కారణాలేమిటన్న విషయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... టీడీపీ బలహీనతలనే తనకు అనుకూలంగా మలచుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీని చావుదెబ్బ కొట్టేశారని - తాను మాత్రం ఊహించని విక్టరీ అందుకున్నారని పోలిట్ బ్యూరో దాదాపుగా నిర్ధారించుకుందట. అంతేకాకుండా సామాజిక సమీకరణాల విషయంలో టీడీపీ బాగా వెనకబడిపోయిందని - అదే సమయంలో జగన్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టి దాదాపుగా అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి ఓటర్లను ఆకట్టుకున్నారని కూడా పోలిట్ బ్యూరో అభిప్రాయపడింది.
ఇక ఎన్నికల సమయంలో మనీ మేనేజ్ మెంట్ విషయంలోనూ చంద్రబాబు కంటే కూడా జగన్ బెటర్ గా వ్యవహరించారని - వైసీపీ ఖర్చుపెట్టినంత మేర డబ్బు ఖర్చు చేయడంలో టీడీపీ వెనకబడిపోయిందని కూడా అభిప్రాయపడింది. డబ్బు పంపిణీకి సంబంధించి వైసీపీ అనుసరించిన వ్యూహం చాలా పక్కాగా - ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సాగిపోయిందని కూడా అభిప్రాయపడిందట. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులుగా టీడీపీ నేతల్లో మితి మీరిన విశ్వాసంతో ముందుకెళితే - మరికొందరు అసలు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించారని... అదే సమయంలో వైసీపీ ప్రతి విషయంలో టీడీపీ కంటే మెరుగ్గా వ్యవహరించిందని తేల్చింది. మనీ మేనేజ్ మెంట్ లో వైసీపీ వ్యవహరించిన తీరు తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారట.
మొత్తంగా టీడీపీ ప్రతికూలతలు - చంద్రబాబు మైనస్ లను జగన్ తనకు అనుకూలంగా మలచుకుని విక్టరీ కొట్టి - తమకు దెబ్బేశారని పోలిట్ బ్యూరో నిగ్గు తేల్చిందట. మొత్తంగా ఎన్నికల్లో కీలక అంశాలుగా ఉన్న ప్రతి విషయంలోనూ జగన్ చాలా నేర్పుగా వ్యవహరించారని - అంతేకాకుండా తమ పార్టీ ఎక్కడైతే బలహీనంగా కనిపించిందో - దానినే తనకు అనుకూలంగా మలచుకుని ఆయన రికార్డు విక్టరీ కొట్టేశారని పోలిట్ బ్యూరో ఓ అంచనాకు వచ్చిందట. ఇక పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా పోలిట్ బ్యూరో కాస్తంత లోతుగానే చర్చిందట. పార్టీలో కిందిస్థాయి నుంచి అన్ని కమిటీలను ప్రక్షాళన చేయాల్సిందేనని, కొత్త రక్తానికి అవకాశం కల్పించాల్సిందేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్లు తేల్చేశారట. ఇలా కాకుండా మునుపటిలానే వ్యవహరిస్తే పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం లేకపోలేదన్న వాదనను వారు వినిపించారట.