కొత్త రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ బయలుదేరి వెళ్లాడు. మొన్న వైజాగ్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో సుమారు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకుపైగా ఎంవోయూలు కుదుర్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి... ఈసారి లండన్లో జరిగే బిజినెస్ మీట్ లో కూడా మరో లక్షకోట్ల పెట్టుబడులకైనా ఎంవోయూలు కుదుర్చుకుంటాడేమోనని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు తన టీమ్ తో కలిసి లండన్ బయలుదేరి వెళ్లాడు. లండన్ లో జరిగే పారిశ్రామిక వేత్తల సదస్సులో ఏపీ నూతన పారిశ్రామిక విధాన పాలసీని వివరించనున్నాడు.
అసలే కొత్తరాష్ట్రం... పరిశ్రమలు అంతంత మాత్రమే. దాంతో ఏపీ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ.. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగానే వున్నా... మౌళిక సదుపాయల కొరత కారణంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదనే చెప్పాలి. దాంతో ఇప్పడు తాజా బడ్జెట్టులో మౌలిక సదుపాయల కల్పనకు బాగానే నిధులను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. పోర్టులు - విమానాశ్రయాలు - రహదారుల అభివృద్ధికి నిధులను బాగానే కేటాయించారు. దాంతో ఈ ఏడాది నుంచైనా పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుడతారేమో చూడాలి. ఇప్పటికే శ్రీసిటీ - వాన్ పిక్ సెజ్ లలో కొన్ని పరిశ్రమలు స్థాపించినా... అవేవీ రాష్ట్ర ఆర్థిక - ఉపాధి కల్పనకు ఉపయోగపడవు. సో... ఇక భారీ పెట్టుబడులు పెడితేనే.. రాష్ట్రానికి ఉపయోగం.. యువతకు ఉపాధి. చూద్దాం బాబు ఏమి చెస్తాడో?