ఏపీ సీఎం చంద్రబాబుకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ వస్తుందా..? రాదా?..
ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా?
చిన్నదో పెద్దతో షికాగో స్టేట్ యూనివర్సిటీ బాబుకు ఒక డాక్టరేట్ ను ప్రకటించిన తరువాత వస్తుందా రాదా అన్న ప్రశ్న ఎందుకొచ్చిందన సందేహం వచ్చిందా?
నిజమే... ప్రకటించిన తరువాత ప్రదానం చేయాలి. కానీ, ప్రస్తుతం ఆ యూనివర్సిటీ పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు వెళ్లి డాక్టరేట్ అందుకునే వరకు కూడా అది ఉండేలా లేదని అంటున్నారు. పూర్తిగా నష్టాల్లో ఉన్న ఆ యూనివర్సిటీ గేట్లు త్వరలో మూతపడేలా ఉన్నాయని అంటున్నారు.
చంద్రబాబు డాక్టరేట్ అంశం మొదట్నుంచి ఇలాగే అయింది. ఆయనకు షికాగో స్టేట్ వర్సిటీ డాక్టరేట్ ప్రకటించగానే ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీ బాబును గౌరవిస్తోందని టీడీపీ శ్రేణులు హర్సించాయి. అయితే... ఆ వర్సిటీ చాలా చిన్నదని.... అమెరికాలో షికాగో వర్సిటీ ఫేమస్ కానీ, షికాగో స్టేట్ వర్సిటీ బచ్చా అని.. అలాంటి వర్సిటీ డాక్టరేట్ ఇస్తే అందులో గొప్పేముందని వైసీపీ వారు ప్రచారం మొదలు పెట్టారు. దీంతో టీడీపీ నేతలంతా సైలెంటయిపోయారు. అక్కడితో ఆ విషయం సద్దుమణిగిపోయింది.
అయితే తాజాగా చంద్రబాబుకు డాక్టరేట్ ప్రకటించిన వర్సిటీ పరిస్థితి బాగులేదని... దివాలా తీసిందని తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న యూనివర్శిటీ ప్రతి ఏటా స్టేట్ ఫండింగ్‌పై ఆధారపడుతూ మూలుగుతూ ముక్కుతూ నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడా ఆ నిధులు కూడా నిలిచిపోయాయి. వర్శిటీలో అవకతవకల కారణంగానే నిధులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ చదువుతున్న విద్యార్థులు సైతం దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు డాక్టరేట్ ప్రదానం కూడా అనుమానమే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్శిటీ డాక్టరేట్లు ప్రదానం చేసే అవకాశం లేదంటున్నారు. అయితే.. టీడీపీ నేతలు కూడా ఓ విషయం చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవాలని ఇంకా డిసైడ్ కాలేదంటున్నారు. చెత్త యూనివర్శిటీ అని తెలిసిన తర్వాత కూడా డాక్టరేట్ తీసుకుంటే జీవితాంతం నెగిటివ్‌గానే ప్రచారం సాగుతుందని భావిస్తున్న చంద్రబాబు డాక్టరేట్ వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది.